గత కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ మాఫీయాపై పోరాటం సాగిస్తోందని టీడీపీ నేత పట్టాభి వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డ్రగ్స్‌పై ఉద్యమానికి చేపట్టారు. అందులో తాను కూడా ఓ భాగమై.. క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే.. తాను మాట్లాడిన మాటలకు లేని అర్ధాలను సృష్టించి అధికార పార్టీ శ్రేణులు కక్ష, కుట్రపూరితంగా వ్యవహరించారని పట్టాభి తెలిపారు.
తన ఇంటిపై జరిగిన దాడిలో తన కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైందని.. అందుకే కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసం బయటకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తనపై పెట్టిన అక్రమ కేసులను న్యాయబద్దంగానే ఎదుర్కుంటానని అన్నారు. త్వరలో క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో ,డ్రగ్స్ మాఫియా పోరాటంలో పాల్గొంటానని టీడీపీ నేత పట్టాభి స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో క్రింద వీడియోలో చూడండి..
Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.
డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!
రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..