ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికారమే లక్ష్యంగా టీడపీ ముందుకు సాగుతోంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. మొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రస్తుతం కర్నూలు జిల్లా బనగాన పల్లెలో ప్రచారం నిర్వహింస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మొత్తం 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు 139 మంది శాసనసభ, 13 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది.
మిగిలిన 9 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు క్యాండిడేట్ల జాబితాను విడుదల చేసింది. గత కొంత కాలంగా చీపురు పల్లి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ చివరికి ఆ స్థానాన్ని కళా వెంకట్రావుకు కేటాయించారు. ఈ సీటుపై కళా వెంకట్రావు వర్గం ఆందోళనలు కూడా చేసింది. అలాగే కదిరి నియోజకవర్గంలో ముందుగా యశోద పేరును అనుకున్నప్పటికీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ కు అవకాశాన్ని ఇచ్చింది.