Chandrababu Naidu: త్వరలోనే పర్యటిస్తా.. వరద బాధితులకు అండగా నిలవండి: టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu: ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా

Chandrababu Naidu: త్వరలోనే పర్యటిస్తా.. వరద బాధితులకు అండగా నిలవండి: టీడీపీ అధినేత చంద్రబాబు
Chandrababu Naidu

Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 7:05 PM

TDP Chief Chandrababu Naidu: ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో వరదల పరిస్థితులపై చంద్రబాబు పార్టీ నేతలతో శనివారం సమీక్షించారు. వరద బాధితులకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులతో పాటు చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చంద్రబాబు నాయుడు నాయకులతో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ పార్టీ ద్వారా ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడంతోపాటు.. చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు చంద్రబాబు తెలిపారు. టీడీపీ శ్రేణులు బాధితులకు అండగా నిలిచి బాధితులకు ఆహారం అందించాలని సూచించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తున్న వీడియోను ట్విట్ చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విపత్తు సమయాల్లో పని చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అంటూ ఆయన గుర్తు చేశారు.

Also Read:

Jr NTR: వ్యక్తిగత దూషణలు సరికాదు.. అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..

AP Floods: రెస్క్యూ చేస్తుండగా ప్రమాదం.. తండ్రీకొడుకులను కాపాడి చనిపోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్..