Chandrababu: ప్రజలు భయపడుతున్నారు.. అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు..

|

Jun 20, 2023 | 9:52 AM

Chandrababu Naidu: వైఎస్ఆర్సీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Chandrababu: ప్రజలు భయపడుతున్నారు.. అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు..
Chandrababu
Follow us on

Chandrababu Naidu: వైఎస్ఆర్సీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం వెళ్లిన చంద్రబాబు అమర్నాథ్ తల్లి, సోదరిని చంద్రబాబు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అమర్నాథ్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేకాదు అమర్నాథ్ సోదరి చదువుల బాధ్యత తాను తీసుకుంటానని.. ఇకపై ఆమె తన దత్త పుత్రిక అని బాబు తెలిపారు.

అమర్నాథ్ హత్య తర్వాత రాష్ట్రంలో ఆడబిడ్డలను కాపాడకునేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అమర్నాథ్ సోదరి హేమశ్రీకి ధైర్యం ఇవ్వటానికే తాను ఇక్కడకు వచ్చానని స్పష్టం చేసారు. అమర్నాథ్ సోదరి హేమశ్రీని దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అమర్నాథ్ సోదరి ఎంత వరకూ చదువుకుంటే అంతవరకూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చదివించే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్ధికసాయం అందజేశారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో గంజాయి సంస్కృతి పోతేనే ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందన్నారు బాబు. గంజాయిని అరికట్టేందుకు ఉక్కు సంకల్పంతో కృషి చేస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం