బీజేపీ, టీడీపీ మధ్య పొలిటికల్‌ మైలేజ్‌ పోటీ.. ఆలయాలపై బీజేపీ చిత్తశుద్ధిని ప్రశ్నించిన ఏపీ టీడీపీ చీఫ్‌

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటంలో అధికార పార్టీపై బీజేపీ, టీడీపీ తీవ్రంగా విమర్శల దాడి పెంచుతున్న విషయం తెలిసిందే..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 7:09 pm, Wed, 20 January 21
బీజేపీ, టీడీపీ మధ్య పొలిటికల్‌ మైలేజ్‌ పోటీ.. ఆలయాలపై బీజేపీ చిత్తశుద్ధిని ప్రశ్నించిన ఏపీ టీడీపీ చీఫ్‌

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటంలో అధికార పార్టీపై బీజేపీ, టీడీపీ తీవ్రంగా విమర్శల దాడి పెంచుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆలయ రాజకీయాలు ఏపీలో పీక్‌ స్టేజికి చేరాయి.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీలు పోటాపోటీగా విమర్శలు చేస్తూ వస్తున్నాయి విగ్రహాల ధ్వంసం ఘటనలను పొలిటికల్‌ మైలేజ్‌కి ఉపయోగించేందుకు ఈ రెండు పార్టీలు మొదటి నుంచి పోటా పోటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఈనేపథ్యంలో బీజేపీ చిత్తశుద్ధిని ప్రశ్నించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థ చేత ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ముందు విచారణ జరిపించి అప్పుడు ఆలయాలపై మాట్లాడితే జనం విశ్వసిస్తారని అచ్చెన్నాయుడు విమర్శించారు.