AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geyser Blast: ఇంట్లో బాంబుల్లా మారుతున్న గీజర్లు..! ఈ చిన్న పొరపాట్లే పెను ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!

చాలా మంది ఇంట్లో హాట్ వాటర్‌ కోసం గీజర్‌ వాడుతుంటారు. కానీ వాటని సరిగ్గా మెయింటేన్ చేయపోతే కొన్ని సార్లు అవి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. ఎందుకంటే తాజాగా గీజర్ సిలిండర్ పేలడం కారణంగా ఇద్దరు చిన్నారుల సహా ఇంట్లో ఉన్న 8 మంది కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన తాడిపత్రిలో వెలుగు చూసింది.

Geyser Blast: ఇంట్లో బాంబుల్లా మారుతున్న గీజర్లు..! ఈ చిన్న పొరపాట్లే పెను ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!
Geyser Explosion Safety
Anand T
|

Updated on: Jan 04, 2026 | 8:58 AM

Share

ఇంట్లో హాట్‌ వాటర్ కోసం వినియోగించే గీజర్ సిలిండర్ పేలి 8 మంది గాయపడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడిపత్రిలో వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న గీజర్ ఉన్నట్టుంది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగి.. అవికాస్త ఇల్లు మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారుల సహా మరో ఆరుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ సహాయంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్షతగాత్రులంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో ఇంట్లోని ఫర్నిచల్ మొత్తం కాలిపోయినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గీజర్ వాడేప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తలు 

మనం గీజర్ వాడేప్పుడు కొన్ని జాగ్రత్తు తీసుకుంటే.. అవి పేలే ప్రమాదాలను తగ్గించవచ్చు. చాలా మంది స్నానం చేసిన వెంటనే గీజన్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. ఇలా చేయడం వల్ల గీజర్ ఎక్కువ సమయం ఆన్‌లో ఉండి.. దానిలో ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే గీజర్ బటన్ ఆఫ్ చేయండి.

చాలా మంది విద్యుత్‌ బిల్‌ తగ్గించుకునేందుకు గ్యాస్ గీజర్స్ వాడుతారు. కొన్ని సార్లు వీటి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం మీరు గీజర్ పెట్టే గదిలో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్ అమర్చండి. ఇది గ్యాస్ లీకైతే దాన్ని బయటకు పంపేందుకు సహాయపడుంది.

మరికొందరు తక్కడు డబ్బులతో నాణ్యతలేని గీజర్లను కొంటుంటారు. ఇది చాలా ప్రమాదం. కాబట్టి డబ్బులు పోయినా మంచి నాణ్యమైన, సురక్షితమైన గీజర్లను మాత్రమే కొనండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
అభిమానులకు బిగ్ షాక్.. విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్..
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
నాన్‌వెజ్ లవర్స్‌కు గుండెపగిలే వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం.. అరుదైన కుడ్య శిల్పం ఇదిగో
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
సచిన్‌ను ‘బ్రాండ్’గా మార్చిన ఆ మాస్టర్ మైండ్ ఇతనే..!
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
40 ఏళ్ల తర్వాత మర్చిపోని చంద్రబోస్..! ఏకంగా రూ.40 లక్షలతో
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
తిరుమల వెళ్లేవారికి మరో శుభవార్త..
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!