AP Weather Report: రాగల 3 రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. వాతావరణ వివరాలు
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి ఈ రోజు గాంజెటిక్ పశ్చిమ బెంగాల్ సమీపంలోని పశ్చిమ ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండదు. ప్రస్తుతం రాగల మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈ రోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ సంచాలకులు తెలిపారు.