AP Weather Report: ఏపీలో రాగాల మూడు రోజులకు వాతావరణ సూచన.. అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ లోని తాజా వాతావరణ పరిస్థితిపై రాగాల మూడురోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది...
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ లోని తాజా వాతావరణ పరిస్థితిపై రాగాల మూడురోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ .. పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు 0.9km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఛతీస్ గఢ్ , తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీంతో రాగాల మూడు రోజుల వాతావరణ సూచనను ప్రకటించించింది వాతావరణ శాఖ.
ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ నెల 20న ఉత్తర, దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఇక రాయల సీమలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అంతేకాదు గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2 – 3°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2 – 3°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 21న రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Also Read: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!