బ్రేకింగ్ న్యూస్: డేంజర్‌ జోన్‌లో శ్రీశైలం డ్యామ్.. భారీ మూల్యం..!

శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందా..? మరికొద్ది రోజుల్లో ఆ సమస్య మరింత జఠిలం కానుందా..? అవునని.. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చెబుతున్నారు. తొందరలోనే.. మరమ్మతులు చేపట్టకపోతే.. డ్యామ్‌కి ముప్పుతప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా.. ఆయన.. గంగాజల్ సాక్షరత యాత్రలో భాగంగా.. శ్రీశైలం డ్యామ్‌‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా.. రాజేంద్ర సింగ్.. డ్యామ్‌ గురించి పలు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందని.. పగుళ్లు వచ్చి డ్యామ్‌కు వాటర్ లీకేజీలు ఎక్కువగా […]

బ్రేకింగ్ న్యూస్: డేంజర్‌ జోన్‌లో శ్రీశైలం డ్యామ్.. భారీ మూల్యం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 1:46 PM

శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందా..? మరికొద్ది రోజుల్లో ఆ సమస్య మరింత జఠిలం కానుందా..? అవునని.. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చెబుతున్నారు. తొందరలోనే.. మరమ్మతులు చేపట్టకపోతే.. డ్యామ్‌కి ముప్పుతప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా.. ఆయన.. గంగాజల్ సాక్షరత యాత్రలో భాగంగా.. శ్రీశైలం డ్యామ్‌‌ని పరిశీలించారు. ఈ సందర్భంగా.. రాజేంద్ర సింగ్.. డ్యామ్‌ గురించి పలు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందని.. పగుళ్లు వచ్చి డ్యామ్‌కు వాటర్ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గంగాజల్ సాక్షరత యాత్రలో భాగంగా శ్రీశైలం డ్యామ్ పరిశీలించింది రాజేంద్రసింగ్ బృందం.

ప్రధాన డ్యామ్ ఎదురుగా భారీ గొయ్యి ఏర్పడిందని.. డ్యామ్ గేట్లు ఎత్తిన ప్రతీసారి అది మరింత పెద్దదవుతుందని ఆయన తెలిపారు. ఆ గొయ్యి విస్తరిస్తూ.. డ్యామ్ పునాదుల వరకూ వెళ్తుందని.. దాంతో.. చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉందని స్పష్టం చేశారు. చాలా కాలం నుంచి లీకేజీలు వస్తున్నా పట్టించుకోవడం లేదని, డ్యామ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే ప్రమాదం పొంచి ఉందన్నారు. సరైన వసతులు లేక డ్యామ్ దగ్గర పనిచేయడానికి ఇంజినీర్లు రావడం లేదు. 600 మంది పని చేయాల్సిన చోట 100 మంది మాత్రమే పనిచేస్తున్నారని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా.. ఈ డ్యామ్‌కు మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు.