AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నాయకుల మధ్య చిచ్చు పెడుతోన్న ప్రత్యేక విమానాలు.. ఏపీలో ఇప్పుడంతా ఇదే చర్చ

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు లేదా దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్లిన స‌మ‌యంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఎక్కువ‌గా ప్రత్యేక విమానాల్లోనే వెళ్తుంటారు. ఇటీవ‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌రిగిన ఆర్ - 5 జోన్ ఇళ్ల శంఖ‌స్థాప‌న కార్యక్రమానికి హెలికాప్టర్‌లో హాజ‌ర‌య్యారు సీఎం. ఇంత ద‌గ్గర్లో ఉన్న కార్యక్రమానికి హెలికాప్టర్ లో హాజ‌రుకావ‌డాన్ని ప్రతిప‌క్షాలు త‌ప్పుప‌ట్టాయి. త‌న నివాసానికి ద‌గ్గర‌గా అమ‌రావ‌తి ఉన్నప్పటికీ అక్కడికి వ‌చ్చే ల‌క్షలాది మంది ప్రజ‌లకు ఇబ్బందులు త‌లెత్తకూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఆయ‌న హెలికాప్టర్ లో..

Andhra Pradesh: నాయకుల మధ్య చిచ్చు పెడుతోన్న ప్రత్యేక విమానాలు.. ఏపీలో ఇప్పుడంతా ఇదే చర్చ
Andhra Pradesh
S Haseena
| Edited By: |

Updated on: Sep 08, 2023 | 3:07 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి సెప్టెంబ‌ర్ రెండో తేదీ అర్ధరాత్రి లండ‌న్‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి లండ‌న్ లో ఉన్న త‌మ కూతుళ్ల వ‌ద్దకు వెళ్లిన‌ట్లు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సీఎం జ‌గ‌న్ దంప‌తులు విదేశీ ప‌ర్యట‌న‌లోనే ఉండ‌నున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారిక ప‌ర్యట‌న‌ల కోసం వివిధ జిల్లాల‌కు వెళ్లేట‌ప్పుడు హెలికాప్టర్ లేదా ఎక్కువ‌గా చార్టర్డ్ విమానాల్లో ప్రయాణిస్తున్నారు, భ‌ద్రతా కార‌ణాల‌తో పాటు వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోయినా, స్థానికంగా ఇబ్బందులు రాకూడ‌ద‌నే ఉద్దేశంతో ఎక్కువ‌గా ఆయ‌న ప్రత్యేక‌ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తూ వస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు లేదా దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్లిన స‌మ‌యంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఎక్కువ‌గా ప్రత్యేక విమానాల్లోనే వెళ్తుంటారు. ఇటీవ‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌రిగిన ఆర్ – 5 జోన్ ఇళ్ల శంఖ‌స్థాప‌న కార్యక్రమానికి హెలికాప్టర్‌లో హాజ‌ర‌య్యారు సీఎం. ఇంత ద‌గ్గర్లో ఉన్న కార్యక్రమానికి హెలికాప్టర్ లో హాజ‌రుకావ‌డాన్ని ప్రతిప‌క్షాలు త‌ప్పుప‌ట్టాయి. త‌న నివాసానికి ద‌గ్గర‌గా అమ‌రావ‌తి ఉన్నప్పటికీ అక్కడికి వ‌చ్చే ల‌క్షలాది మంది ప్రజ‌లకు ఇబ్బందులు త‌లెత్తకూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఆయ‌న హెలికాప్టర్ లో వెళ్లార‌ని అధికారులు తెలిపారు. పైగా రాజ‌ధాని గ్రామాల్లో రోడ్లు కూడా ఇరుకుగా ఉండ‌టంతో అమ‌రావ‌తిలో కార్యక్రమాల‌కు హెలికాప్టర్ ద్వారా హాజ‌రైన‌ట్లు సీఎం కార్యాల‌య అధికారులు స్పష్టత ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా సీఎం జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్యట‌న‌పైనా ప్రతిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. పేద‌ల ప‌క్షపాతి అని చెప్పుకుంటూ అత్యంత విలాస‌వంత‌మైన ప్రత్యేక విమానంలో ప‌ర్యట‌న‌కు వెళ్లారంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అయితే ప్రతిప‌క్షాల విమ‌ర్శల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, ప‌వ‌న్ లు ప్రత్యేక విమానాల్లో తిర‌గ‌డం లేదా అంటూ కౌంట‌ర్లు వేస్తున్ఆనరు. ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రత్యేక విమానంలో లండ‌న్ వెళ్లడాన్ని త‌ప్పుప‌డుతున్న ప్రతిప‌క్షాల‌కు అధికార పార్టీ నేత‌లు కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్‌లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి త‌న సొంత ఖ‌ర్చుల‌తో లండ‌న్ కు వెళ్లార‌ని, అక్కడ అయ్యే ఖ‌ర్చుల‌న్నీ కూడా ఆయ‌న సొంత ఖాతా నుంచే జ‌రుగుతున్నాయి త‌ప్ప….ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఖ‌జానా నుంచి ఒక్క రూపాయి కూడా సొంత ప‌ర్యట‌న‌కు వినియోగించుకోవ‌డం లేద‌నేది అధికార పార్టీ నేత‌లు అంటున్నారు. అధికారిక కార్యక్రమాల‌కు వివిధ కార‌ణాల‌తో ప్రభుత్వ ఖ‌ర్చులతో ప్రత్యేక విమానాల్లో వెళ్లిన‌ప్పటికీ, లండ‌న్ ప‌ర్యట‌న ఖ‌ర్చంతా సీఎం సొంతంగా పెట్టుకున్నదే అని సీఎంవో వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక గ‌తంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే వెళ్లేవార‌ని గుర్తు చేస్తున్నారు. నాలుగుసార్లు దావోస్ ప‌ర్యట‌న‌కు, ఆ త‌ర్వాత సింగ‌పూర్ ప‌ర్యట‌న‌ల‌కు… ఇలా ఎక్కడికి వెళ్లినా అమ‌రావ‌తి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో వెళ్లిన‌ప్పుడు ఎన్ని కోట్లు ప్రభుత్వ ధ‌నం వృధా అయింద‌ని ప్రశ్నిస్తున్నారు.

సీఎం జ‌గ‌న్ విదేశీ ప‌ర్యట‌న‌కు 40 కోట్లు ఖ‌ర్చయింద‌ని త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరిగితే సొంత ఖ‌ర్చుతో వెళ్లిన ముఖ్యమంత్రిపై విమ‌ర్శలు చేయ‌డం స‌బ‌బు కాదంటున్నారు. ఇప్పటికీ చంద్రబాబుతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నార‌ని అంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తికి ఎప్పుడు వ‌చ్చినా ఖ‌చ్చితంగా ప్రత్యేక విమానంలోనే ఆయ‌న వ‌స్తున్నార‌ని అంటున్నారు. ప్రతిప‌క్ష నేత‌లు ప్రత్యేక విమానాలు వాడగా లేనిది, రాష్ట్ర ముఖ్యమంత్రి అందునా హైసెక్యూరిటీ జోన్‌లో ఉండే సీఎం త‌న సొంత ఖ‌ర్చుల‌తో ప్రయాణాలు చేయ‌డాన్ని కూడా రాజ‌కీయంగా వాడుకుంటున్నార‌ని వైఎస్సార్ సీపీ నేత‌లు కౌంట‌ర్లు ఇస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటిక‌ల్ స్పెష‌ల్ ఫ్లయిట్స్ గొడ‌వ స్టార్ట్ అయింది.

చంద్రబాబు వృధా చేసిన స్పెష‌ల్ ఫ్లయిట్స్ ప్రజా ధ‌నం లెక్క బ‌య‌ట‌పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక విమానాల గోల రాజ‌కీయంగా విమ‌ర్శలు, ప్రతివిమ‌ర్శల‌కు దారి తీసింది. సీఎం జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్యట‌న ఖ‌ర్చు 40 కోట్లని ప్రతిప‌క్షాలు ఆరోపిస్తుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కోట్లు ప్రజాధనం వృధా చేశార‌ని వైసీపీ రివ‌ర్స్ ఎటాక్ చేస్తుంది. కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ది కోసం జ‌గ‌న్ విదేశీ ప‌ర్యట‌న‌ను కూడా వాడుకుంటున్నార‌నేది వైసీపీ వాద‌న. సొంత డ‌బ్బుల‌తో వెళ్తే ఎవ‌రికి న‌ష్టం అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశం ప‌క్కదారి ప‌ట్టించేందుకే స్పెష‌ల్ ఫ్లైట్ అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చార‌ని అధికార పార్టీ చెప్పుకొస్తుంది. చంద్రబాబు,ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల ప్రత్యేక ఫ్లైట్‌ల‌పై ముందు అన్ని విష‌యాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిప‌క్షాలు విమ‌ర్శలు కొన‌సాగిస్తే తాము కూడా అదే రీతిలో స‌మాధానం చెబుతామంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక విమ‌నాల గొడ‌వ ఎప్పటికో స‌ద్దుమ‌ణుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..