ఐదు రోజుల్లో మైనర్ బాలికతో ప్రేమ.. ఆరో రోజు పోలీసుల అదుపులో ప్రియుడు..! ఏం జరిగిందంటే….
ఈ క్రమంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గోపీ తన స్నేహితుడు మణికంఠతో కలిసి హాస్టల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో హాస్టల్ వాచ్‌మాన్, వార్డెన్ అందుబాటులో లేరు. ఇంతా జరిగినా ఏమీ జరగనట్లు తెల్లవారు జామునే బాలికలిద్దరూ గోపి, మణికంఠ బైక్ లపై హాస్టల్ కు తిరిగి వచ్చినట్లు చెప్పారు. దీంతో పట్టాభిపురం పోలీసులు గోపి, మణికంఠలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఆ యువకుడి పేరు గోపి…. అమరావతి మండలం లింగాపురానికి చెందిన యువకుడు ఎస్బీ సిఐ వద్ద ప్రవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పట్టాభిపురంలోని చంద్రమౌళీశ్వర నగర్ లో సాంఘీక సంక్షేమ హాస్టల్ లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక పరిచయం అయింది. గత ఐదు రోజులుగా గోపి హస్టల్ సమీపంలో ఆ బాలికతో మాట్లాడటమే కాకుండా గాంధీ పార్క్ కు కూడా తీసుకెళ్లాడు. ఐదు రోజుల పరిచయానికే ఆ బాలిక గోపితో చనువుగా ఉంటూ వస్తుంది.
ఇది ఇలా ఉండగా సోమవారం సాయంత్రం హాస్టల్ వద్దకు ఒక బాలిక తల్లిదండ్రులు వచ్చారు. ఆ సమయంలో వారిని లోపలికి అనుమతించిన వాచ్ మెన్ తల్లిదండ్రులతో కలిసి హాస్టల్ లోపలికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గోపితో చనువుగా ఉంటున్న బాలిక తన స్నేహితురాలితో కలిసి హాస్టల్ బయటకు వచ్చింది. హాస్టల్ కు సమీపంలో ఉన్న గోపి అతని స్నేహితుడైన మణికంఠ బైక్ లు ఎక్కి అక్కడ నుండి ఉడాయించారు. అయితే రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇద్దరు బాలికలు మిస్ అయినట్లు హాస్టల్ వార్డెన్ అనురాధ గుర్తించారు. వెంటనే పట్టాభిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రంతా అందరూ కలిసి బాలికల కోసం వెదకటం మొదలు పెట్టారు. అయితే తెల్లవారు జామునే బాలికలు ఇద్దరూ తిరిగి హాస్టల్ వద్దకు వచ్చారు.
ఈ విషయాన్ని వెంటనే సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికలను ప్రశ్నించారు. అయితే బాలికలు చెప్పిన సమాధానాలు విన్న పోలీసులు, హాస్టల్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. గోపితో ప్రేమలో పడినట్లు బాలిక చెప్పింది. అతను పిలవటంతోనే రాత్రి సమయంలో తన స్నేహితురాలితో కలిసి హాస్టల్ బయటకు వెళ్లింది. ఆ తర్వాత నలుగురు రాజీవ్ గ్రుహకల్పలోని రూమ్స్ కి వెళ్లారు. గోపి ఒక బాలికపై అత్యాచారం చేయగా, మరొక బాలిక మణికంఠను ప్రతిఘటించింది. ఇంతా జరిగినా ఏమీ జరగనట్లు తెల్లవారు జామునే బాలికలిద్దరూ గోపి, మణికంఠ బైక్ లపై హాస్టల్ కు తిరిగి వచ్చినట్లు చెప్పారు. దీంతో పట్టాభిపురం పోలీసులు గోపి, మణికంఠలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..