Andhra News: వీడు తండ్రి కాదు కాలయముడు.. 8 నెలల బిడ్డను హత్య చేసి.. ఏం చేశాడో తెలిస్తే!
కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. 8 నెలల పసికందును హత్య చేసి పొలంలోని నీటి డ్రమ్ములో పడేశాడు ఓ కసాయి తండ్రి. ఆ తర్వాత కట్టుకున్న భార్యను కూడా కడతేర్చేందుకు ఆమెపై హత్యాయత్నం చేశాడు. తీవ్రగాయాలతో పొలంలో పడి ఉన్న ఆమెను అత్తమామలు హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. 8 నెలల పసికందును హత్య చేసి పొలంలోని నీటి డ్రమ్ములో పడేశాడు ఓ కసాయి తండ్రి.ఆ తర్వాత కట్టుకున్న భార్యను కూడా కడతేర్చేందుకు ఆమెపై హత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే దేవనకొండ కు చెందిన చాకలి నరేష్, గోనెగండ్ల మండలం కులుమాల కు చెందిన శ్రావణి కి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి పండంటి ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. అయితే వీరి మధ్యలోకి అనుమానం పెనుభూతం ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి భర్త నరేష్ భార్య శ్రావణిని ఇబ్బందులు గురిచేస్తూ వచ్చాడు.
నరేష్ కు గతంలోనే వివాహమై ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలోనూ భార్యపై అనుమానంతో భార్యను కడ తీర్చాడు నరేష్. ఆ తర్వాత శ్రావణిని రెండో భార్యగా పెళ్లి చేసుకుని జీవితం సాగిస్తున్నాడు. ఈమెపై కూడా అనుమానం పెంచుకొని ప్రతిరోజు ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. గురువారం కూడా భార్య భర్తల మధ్య గొడవల జరిగింది. ఈ క్రమంలో భార్యపై కోపంతో నరేష్ ఏ తండ్రి చేయని దారుణానికి ఒడికట్టాడు. కడుపున పుట్టిన కుమారుడుని తీసుకెళ్లి డ్రమ్ములో పడేసి హత్య చేశాడు. ఆ తర్వాత భార్యను కూడా హత్యచేసేందుకు ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు.
గమనించిన అత్తమామలు అతన్ని అడ్డుకొని తీవ్రంగా గాయపడిన శ్రావణిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే కడుపున పుట్టిన బిడ్డ చనిపోవడంతో శ్రావణి గుండెలు పగిలేలా రోధించింది. విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు, బంధువులు వెంటనే హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన చాకలి నరేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానిక చేరకున్న పోలీసులు కంప్లైంట్ ఇస్తే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




