Andhra Pradesh Video: గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి… పొలంలోకి గొర్రెలు వచ్చాయని దారుణం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో దారుణం జరిగింది. పొలంలోకి గొర్రెలు వచ్చినాయనే కారణంతో గొర్రెల కాపరులపై పొలం యజమాని గొడ్డలితో దాడికి దిగారు. గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి చేశారు వల్లెపు రాంబాబు, అతని సోదరులు. తమ పొలంలోకి గొర్రెల మందను...

Shepherds
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో దారుణం జరిగింది. పొలంలోకి గొర్రెలు వచ్చినాయనే కారణంతో గొర్రెల కాపరులపై పొలం యజమాని గొడ్డలితో దాడికి దిగారు. గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి చేశారు వల్లెపు రాంబాబు, అతని సోదరులు. తమ పొలంలోకి గొర్రెల మందను తోలారనే కారణంతో దాడికి తెగబడ్డారు. గొర్రెల కాపరులు బాబు, కాటమరాజు, సైదయ్యలపై దాడిచేశాడు పొలం యజమాని. ఇద్దరికి తీవ్ర గాయాలయయాయి.
బాధితులను హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, గొర్రెల కాపరులపై గొడ్డలితో దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గొర్రెలకాపరుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.
