AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు… శ్రీకాంత్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. స్కామ్‌ల మీద స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై రెండు నెలలుగా జైలులోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో...

Andhra Pradesh: మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు... శ్రీకాంత్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Anil Kumar Yadav
K Sammaiah
|

Updated on: Jul 23, 2025 | 7:18 AM

Share

వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. స్కామ్‌ల మీద స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై రెండు నెలలుగా జైలులోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో.. ఇప్పుడప్పుడే బెయిల్ రావడం కష్టమేనని అనుచరులే అనుకుంటున్నారు. ఇదే మైనింగ్ కేసు మరికొంత మంది నేతల చుట్టూ తిరుగుతుండటం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కు ఉచ్చు బిగిస్తుంది. క్వార్ట్జ్ కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. అతని వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్‌రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

2023 ఆగస్ట్‌ నుంచి క్వార్ట్జ్‌ వ్యాపారం సాగింది. లీజు గుడువు ముగిసినా రుస్తుం మైన్‌ నుంచి క్వార్ట్జ్‌ తీశారు. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్లని శ్రీకాంత్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. క్వార్ట్జ్‌ను డంప్ చేసిన పొలం యజమాని శశిధర్‌రెడ్డికి ఎకరాకు 25వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. రుస్తుం మైన్‌ నుంచి తీసిన క్వార్ట్జ్‌ను.. దువ్వారు శ్రీకాంత్‌రెడ్డి ద్వారా చైనాకు పంపి.. వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ చేసినట్టు చెప్పారు. గూడూరులో 100 ఎకరాల్లో, నాయుడుపేట దగ్గర 50 ఎకరాల్లో వెంచర్లు వేశాం. ఇందులో అనిల్ యాదవ్ భాగస్వామిగా ఉన్నారని శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ రెండు హౌసింగ్‌ ప్రాజెక్టులు చేశామంటూ పోలీసులకు చెప్పేశారు శ్రీకాంత్‌రెడ్డి. మణికొండ, తుర్కయాంజల్‌లో ఈ వెంచర్లు ఉన్నాయన్నారు.

శ్రీకాంత్‌రెడ్డి ఇచ్చిన ఈ వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. అనిల్‌ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే మెజిస్ట్రేట్ ఎదుట శ్రీకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పోలీసులు తనతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తనకు తెలియదని కూడా శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేసును ఎటు మలుపు తిప్పుతాయో చూడాలి.