Watch Video: ఇంటర్ విద్యార్ధిని ప్రెగ్నెంట్.. ఈ కీచక టీచర్‌ను పోలీసులు ఏం చేశారో చూశారా? వీడియో వైరల్
తిరుపతిలో ఓ కీచక టీచర్ యవ్వారం బయటపడింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వక్రబుద్ధితో విద్యార్ధుల పాలిట శాపంగా మారాడు. ఓ ప్రైవేట్ స్కూల్ లో పనిచేసే జలపతి రెడ్డి అదే స్కూల్ లో చదువుతున్న మైనర్ స్టూడెంట్ పై కన్నేశాడు. సోషల్ టీచర్ గా పాఠాలు చెప్పేందుకు విద్యార్దికి చేరువయ్యాడు. ఆ తర్వాత..

తిరుపతి, నవంబర్ 12: తిరుపతిలో ఓ కీచక టీచర్ యవ్వారం బయటపడింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వక్రబుద్ధితో విద్యార్ధుల పాలిట శాపంగా మారాడు. ఓ ప్రైవేట్ స్కూల్ లో పనిచేసే జలపతి రెడ్డి అదే స్కూల్ లో చదువుతున్న మైనర్ స్టూడెంట్ పై కన్నేశాడు. సోషల్ టీచర్ గా పాఠాలు చెప్పేందుకు విద్యార్దికి చేరువయ్యాడు. అప్పటినుంచి ఆ స్టూడెంట్ తో చనువుగానే ఉంటున్నాడు 55 ఏళ్ల జలపతి రెడ్డి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సదరు స్టూడెంట్ నెల తప్పేలా చేశాడు.
స్టూడెంట్ ప్రెగ్నెంట్ కావడం ఇంట్లో తెలిసి పోవడంతో తల్లి నిల దీసింది. టీచర్ చేసిన ఘనకార్యాన్ని బాధిత విద్యార్ధిని తల్లికి చెప్పి విలపించింది. ఈ మేరకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జలపతి రెడ్డి ఘనకార్యం బయటపడింది. తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసారు. బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్న టీచర్ 3 ఏళ్లుగా రిలేషన్షిప్ మెయింటెన్ చేసినట్లు తెలిసింది.
దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దాకా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు సరైన ట్రీట్మెంట్ ఇచ్చారు. జనమంతా చూస్తుండగా నిందితుడు జలపతి రెడ్డిని కోర్టుకు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




