AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ కోటా..

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
AP Forest Department Recruitment
M Sivakumar
| Edited By: |

Updated on: May 18, 2026 | 10:17 AM

Share

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

మే 18 నుంచి జూన్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ క్రీడా ప్రతిభకు సంబంధించిన ధ్రువపత్రాలు మరియు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రత్యేక కమిటీ పరిశీలన చేసి అర్హులను ఎంపిక చేయనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. క్రీడల్లో రాణించిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మరింత ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us