Sanatana Dharma Row: ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు.. ఉదయనిధి స్టాలిన్‌ చిత్రపటానికి పాలాభిషేకం..

| Edited By: Shaik Madar Saheb

Sep 08, 2023 | 1:18 PM

సినీ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యాలపై దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో సనాతన ధర్మం అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఆధ్యాత్మిక వేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయనిధికి అనుకూలంగా పలువురు మద్దతునిస్తున్నారు.

Sanatana Dharma Row: ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారు.. ఉదయనిధి స్టాలిన్‌ చిత్రపటానికి పాలాభిషేకం..
Sanatana Dharma Row
Follow us on

ఒంగోలు, సెప్టెంబర్ 08: సినీ హీరో, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యాలపై దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో సనాతన ధర్మం అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఆధ్యాత్మిక వేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయనిధికి అనుకూలంగా పలువురు మద్దతునిస్తున్నారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యాలపై దుమారం రేగుతున్న సమయంలో ఆయన అభిమానులు స్టాలిన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆయన అభిమానులు పాలాభిషేకం చేశారు. సనాతన ధర్మంలోని కొన్ని మూఢనమ్మకాలను నిర్మూలించానలి మాత్రమే ఉదయనిధి వ్యాఖ్యలు చేశారని, అయితే, ఆయన వ్యాఖ్యలను కొన్ని హిందూ సంస్థలు తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాపట్లజిల్లా అద్దంకిలో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉదయనిధికి మద్దతుగా ఆయన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి.. ఆయన వ్యాఖ్యలను సమర్థించారు.

ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఫ్లెక్సీ చిత్రపటానికి ప్రజాసంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన వాఖ్యలను సమర్ధిస్తూ బాపట్లజిల్లా అద్దంకిలో అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉదయనిధికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సాటి మనిషిని సమానంగా గౌరవించలేని సనాతన ధర్మం తమకు అవసరం లేదంటూ ప్రజా సంఘాల నేతలు అభిప్రయపడ్డారు. భారత రాజ్యాంగాన్ని మాత్రమే అనుసరిస్తామని ప్రజా సంఘాల నేతలు తెలిపారు.

Sanatana Dharma Row

హిందుత్వంలో ఇంకా మూఢ విశ్వాశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని చేసిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్ని కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక ప్రధాన కార్యాదర్శి జ్యోతి శ్రీమన్నారాయణ, ఉపాధ్యక్షుడు అంకం నాగరాజు, బి.ఎస్.పి. కన్వీనర్ మందా జోసఫ్, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న క్రమంలో ఆయన చిత్రపటానికి ఏపీలో క్షీరాభిషేకం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..