AP News: అంతుచిక్కని వ్యాధి పిట్టల్లా రాలుతున్న కోళ్లు.. లబోదిబోమంటున్న రైతులు

| Edited By: Ravi Kiran

Feb 21, 2025 | 10:00 PM

తెలుగు రాష్ట్రాల్లో మరో టెన్షన్‌ నెలకోంది. నిన్నటి వరకూ ఫారం కోళ్లను కాటేసిన బర్డ్‌ ఫ్లూ వైరస్‌ .. ఇప్పుడు టర్న్ తీసుకొని నాటుకోళ్లను కభళిస్తోంది. ఈవైరస్‌తో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాటు కోళ్లు భారీగా చనిపోతున్నాయి. ఆ వివరాలు ఇలా

AP News: అంతుచిక్కని వ్యాధి పిట్టల్లా రాలుతున్న కోళ్లు.. లబోదిబోమంటున్న రైతులు
Bird Flu In Kakinada
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాలను బర్డ్‌ ఫ్లూ వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. నిన్నటి వరకూ ఫారమ్ కోళ్లను పొట్టనపెట్టుకున్న మహమ్మారి ఇప్పుడు నాటుకోళ్లను వదలడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో నాటుకోళ్లకు సైతం బర్డ్‌ఫ్లూ వైరస్ కభళిస్తోంది. రాజోలు దీవిలోని సుమారు 95 గ్రామాల్లో ఈవైరస్‌ కారణంగా నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో నాటు కోళ్లు పెంచే రైతులు లబోదిబోమంటున్నారు.

ఈవైరస్ కారణంగా గత 15 రోజుల నుంచి కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయని చెబుతున్నారు రైతులు. వైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక రకాల వ్యాక్సిన్లు వేయించినా.. ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఒక్కో కోడిని సంవత్సరానికి పైగా వేలల్లో ఖర్చు చేసి పెంచుకుంటున్నామని చెబుతున్నారు. కోళ్లు మృత్యువాత పడడంతో లక్షల్లో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిన్నారు రైతులు. మరోవైపు కోళ్ల ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణమే బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాప్తికి కారణమంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. వైరస్ కారణంగా ఆదిలాబాద్‌లో చికెన్‌ మార్కెట్‌ వారంపాటు బంద్‌ చేశారు వ్యాపారులు. బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్‌ అమ్మకాలు తగ్గడంతో.. వ్యాపారాలు లేక చికెన్‌ మార్కెట్‌ బంద్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి