Tollywood: ఏంటి బ్రో ఇది.! ఆరుగురు పతివ్రతలు మూవీ డైరెక్టర్ ఆ టాలీవుడ్ హీరో తండ్రినా..
ఆరుగురు పతివ్రతలు.. 2004లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటికీ క్రేజ్ మాములుగా ఉండదు. మరోసారి ఈ మూవీ రీ రిలీజ్ కావాలంటున్నారు నెటిజన్లు. మరి ఈ క్రేజీ ఫిల్మ్ ను ఏ డైరెక్టర్ దర్శకత్వం వహించారో తెల్సా.? ఆయన టాలీవుడ్ స్టార్ హీరో తండ్రి.?

ఆరుగురు పతివ్రతలు 2004లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సంచలనం అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన సీన్లను మీమర్స్ తెగ వాడుతుంటారు. 2004 ఫిబ్రవరి 6న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ యమా క్రేజ్ ఉంది. ఎంత అంటే.. ఆ మూవీని మళ్లీ ఇప్పుడు రీ-రిలీజ్ చేయాలని కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ కీలకపాత్రలో పోషించగా.. కమలాకర్ సంగీతం అందించారు. ఇందులో నటించిన ఆరుగురు హీరోయిన్లు.. ఆరేళ్ల తర్వాత ఒక దగ్గర కలిసి.. వాళ్ల కథలను చెప్పుకుంటారు. అందులో కొందరి కథలు నవ్వు తెప్పిస్తే.. మరికొందరి కథలు ఏడిపిస్తాయి. ఇంకొందరివి అబ్బో..! అనేలా చేస్తాయి. ఇక ఈ అద్భుత చిత్రాన్ని దర్శకత్వం వహించింది ఎవరో తెల్సా.? ఇప్పటి టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ తండ్రి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ. ఆయనే ఈ సినిమాను ఈవీవీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు కూడా.
అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనమే అని చెప్పొచ్చు. అతి తక్కువ మంది నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు ఆయన. ఇప్పటికీ ఈ సినిమా రీ-రిలీజ్ కోసం చాలామంది కుర్రాళ్ళు ఎదురుచూస్తున్నారంటే మాటలు కావు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అమృత ఓ బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఆమె బోల్డ్ సీన్స్ కోసం ఈ సినిమాను రిపీటేడ్‌గా చూశారు కుర్రకారు. ఇక ఆ బ్యూటీ ఈ సినిమా తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ నటించలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి