Viral News: చిత్తూరు జిల్లాలో వింత.. కోడిపెట్టే కాదు కోడిపుంజు కూడా గుడ్డు పెడుతుంది..

Viral News: కోడి ముందా? గుడ్డు ముందా? అంటే సమాధానం చెప్పడం కొంచెం కష్టం. అదే కోడిపెట్ట గుడ్డు పెడుతుందా? కోడిపుంజు గుడ్డు పెడుతుందా?

Viral News: చిత్తూరు జిల్లాలో వింత.. కోడిపెట్టే కాదు కోడిపుంజు కూడా గుడ్డు పెడుతుంది..
Hen
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2021 | 2:27 PM

Viral News: కోడి ముందా? గుడ్డు ముందా? అంటే సమాధానం చెప్పడం కొంచెం కష్టం. అదే కోడిపెట్ట గుడ్డు పెడుతుందా? కోడిపుంజు గుడ్డు పెడుతుందా? అంటే మాత్రం టక్కున కోడిపెట్టే గుడ్డు పెడుతుందని ప్రతీ ఒక్కరూ సమాధానం చెబుతారు. అయితే, ఇదే సమాధానం చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి ఎస్టీ కాలనీలో చెబితే.. పప్పులో కాలేశారు అంటారు. ఎందుకంటే.. అక్కడ కోడిపెట్ట కాదు.. కోడిపుంజు గుడ్డు పెట్టింది. ఈ విషయమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంట్లో నాలుగు కోడిపెట్టలతో పాటు.. ఒక పుంజు కూడా ఉంది.

ఇటీవల ఈ కోడిపుంజు గుడ్డు పెట్టింది. అయితే, మొదట వేరే కోడి పెట్టిందని సుబ్రహ్మణ్యం భావించాడు. కానీ, మరుసటి రోజు కూడా గుడ్డు పెట్టడంతో షాక్ అయ్యాడు. అలా ఆ కోడిపుంజు ఐదు రోజులు ఐదు గుడ్లు పెట్టింది. ఆ గడ్లను జాగ్రత్తగా దాచిన సుబ్రహ్మణ్యం.. ఒక రోజు కోడిపుంజును పొదిగేశాడు. అలా కోడిపుంజు పెట్టిన గుడ్ల నుంచి ఐదు కోడిపిల్లలు పుట్టాయి. సుబ్రహ్మణ్యం జరిగిన విషయాన్ని వెటర్నరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగిందని, ఇది కామన్ అని అధికారులు చెబుతున్నారు. కాగా, తాను పొదిగిన కోడిపిల్లలను.. ఆ పుంజు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.

Also read:

తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.

‘దళిత బంధు’ పథకం పేరుకు అభ్యంతరం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటిసులు..

Tokyo Olympics 2021: ఒలింపిక్స్‌లో పతకం.. దేశవ్యాప్తంగా సంబరాలు.. మీరు దేశానికి గర్వకారణం, యూత్‌కి ఆదర్శం అంటున్న ప్రధాని