Chandrababu: రేపు, ఎల్లుండి టీడీపీకి కీలకం..చంద్రబాబు పిటిషన్ల.. లోకేష్ సీఐడీ విచారణపై ఉత్కంఠ..
Come Tomorrow: రేపు, ఎల్లుండి చంద్రబాబు పిటిషన్లపై పలు కోర్టుల్లో విచారణ జరగనుంది. రేపు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ రానుంది. 6 వ నెంబర్ కోర్టులో జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పిటిషన్ పై విచారణ చేయనుంది. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. అయితే తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందని హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు.

మంగళవారం, బుధవారం.. ఈ రెండు రోజులు తెలుగు దేశం పార్టీకి కీలకం. చంద్రబాబు పిటిషన్లపై సుప్రీం, హైకోర్టులో విచారణకు రానున్నాయి. ఎల్లుండి ఐఆర్‌ఆర్ కేసులో లోకేష్‌తో కలిసి మాజీ మంత్రి నారాయణను విచారించనుంది సీఐడీ. అటు చంద్రబాబు పిటిషన్లపై, ఇటు లోకేష్ సీఐడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 3, 4 తేదీలు టీడీపీకి కీలక రోజులు కానున్నాయి. ఇప్పటికే చంద్రబాబుపై మూడు కేసులు నమోదు కాగా.
రేపు, ఎల్లుండి చంద్రబాబు పిటిషన్లపై పలు కోర్టుల్లో విచారణ జరగనుంది. రేపు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ రానుంది. 6 వ నెంబర్ కోర్టులో జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పిటిషన్ పై విచారణ చేయనుంది. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. అయితే తనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందని హైకోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు. గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం అక్రమం అని పిటిషన్‌లో వాదన వినిపించారు చంద్రబాబు తరపు లాయర్లు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో..
అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టవేయడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరగనుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది హైకోర్టు. దీంతో రేపు హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసుపై విచారణ జరగనుంది.
ఇక ఎల్లుండి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసుపై దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేశారు. జస్టిస్ సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈకేసును విచారణ చేయనుంది.
మరోవైపు స్కిల్ డవల్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఎల్లుండి ఉండవల్లి పిటిషన్ కూడా విచారణకు రానుంది. బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5కు వాయిదా వేసింది. అంగళ్లు అల్లర్ల కేసులోను బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
IRR కేసులో అక్టోబర్ 4న సీఐడీ విచారణకు లోకేష్
అటు నారా లోకేష్‌పై ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం కేసులు నమోదయ్యాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌కు ఢిల్లీలో CID నోటీసులు ఇచ్చింది. 4న విజయవాడ రావాలని సూచింది. నోటీసులు తీసుకున్న లోకేష్ విచారణకు వస్తానని రిప్లై ఇచ్చారు. అయితే స్కిల్ స్కాం కేసులో లోకేష్‌ను అక్టోబర్ 4వరకు అరెస్ట్ చేయోద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
అటు హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడగా.. ఇదే కేసులో అక్టోబర్ 4కు లోకేష్ పిటిషన్‌ను వాయిదా వేసింది హైకోర్టు. అటు ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ2గా ఉన్న నారాయణ.. బెయిల్‌పై ఉన్నారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. ఈనెల 4న లోకేష్ తోపాటు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది సీఐడీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
