AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenali: 100 గ్రాముల బంగారం రూ.5లక్షలే.. ముసలోళ్లే కానీ.. మామూలోళ్లు కాదమ్మా..

తక్కువ ధరకే 100 గ్రాముల బంగారం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు కాజేసిన ఇద్దరు వృద్ధులపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంగారం పేరుతో ఇచ్చిన 110 గ్రాముల పూసలు కరిగించగా అవి బంగారు పూత పూసిన రాగి పూసలుగా తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మోసానికి ర్యాప్ గ్యాంగ్‌కు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tenali: 100 గ్రాముల బంగారం రూ.5లక్షలే.. ముసలోళ్లే కానీ.. మామూలోళ్లు కాదమ్మా..
Gold
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 30, 2026 | 12:28 PM

Share

తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ముగ్గురిని బురిడీ కొట్టించిన వృద్ధులపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెనాలికి చెందిన మురళిక్రిష్ణకి రాజమండ్రి, భద్రాచలానికి చెందిన ఇద్దరూ వ్యక్తులతో మంచి స్నేహం ఉంది. ఎప్పటి నుండి వీరి మధ్య స్నేహం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మురళిక్రిష్ణ బంగారం కొనుగోలు చేయబోతున్నట్లు స్నేహితులకు చెప్పాడు. అయితే తక్కువ ధరకే బంగారం అమ్మేందుకు వృద్దులు రెడిగా ఉంటున్నట్లు స్నేహితులు మురళిక్రిష్ణకు చెప్పారు. వంద గ్రాముల బంగారం ఐదు లక్షల రూపాయలకే ఇస్తామన్నట్లు స్నేహితులు తెలిపారు. దీంతో మురళి క్రిష్ణ… ఇద్దరి స్నేహితులతో కలిసి వృద్దులకు ఫోన్ చేశారు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత తెనాలి రూరల్ మండలం అంగలకుదురు వద్దకు వస్తామని ఆ వృద్ధులు మురళిక్రిష్ణకు చెప్పారు.

దీంతో ఈ నెల 24వ తేదిన వృద్దులు చెప్పిన విధంగా అంగలకుదురు వద్దకు స్నేహితులతో కలిసి మురళి క్రిష్ణ వెళ్లాడు. ఇద్దరూ వృద్ధులు కారులో చెప్పిన ప్రాంతానికి వచ్చారు. మురళి క్రిష్ణ వద్ద నుండి ఐదు లక్షల రూపాయలు తీసుకున్న వృద్దుడు 110 గ్రాముల బంగారు పూసలు అందించాడు. వాటిని తీసుకున్న ముగ్గురు స్నేహితులు అక్కడ నుండి వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని కరిగించగా అవి బంగారు పూత పూసిన రాగి పూసలుగా తేలడంతో మురళి క్రిష్ణ అవాక్కయ్యాడు. వెంటనే స్నేహితులను సంప్రదించి మోస పోయినట్లు చెప్పాడు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ వృద్దుల నిందితుల్లో ఒకరు తెనాలి ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసుల తేల్చారు. ర్యాప్ గ్యాంగ్ ఈ తరహా మోసాలకు పాల్పడుతుంటుంది. అయితే తెనాలి ఘటనకు ర్యాప్ గ్యాంగ్ కు సంబంధం ఉందా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us