AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగా..

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన జిమ్ నిర్వాహకులు అతన్ని హాస్పిటల్‌కు తరలించగా అప్పటినే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Andhra News: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగా..
Gym Workout Turns Fatal
Anand T
|

Updated on: Aug 23, 2026 | 8:32 PM

Share

ఫిట్‌గా కనిపించాలని ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది జిమ్‌కు వెళ్లడం డైట్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే వారికి పాలిట షాపంగా మారుతుంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన షాజహాన్‌ LIC డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అతను స్థానికంగా ఉన్న లోటస్ జిమ్ సెంటర్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన జిమ్‌ నిర్వాహకులు అతన్ని వెంటనే కదిరిలోని గవర్నమెంట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ షాజహాన్‌ను పరిష్కించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

అయితే గుండె పోటు కారణంగానే అతని చనిపోయి ఉంటారని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షాజహాన్‌కు ఇప్పటికే గుండెకు 2సార్లు స్టంట్స్‌ వేశారని కుటుంబసభ్యులు తెలిపారు. జిమ్‌లో అతని వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us