చాణక్య నీతి : మీరు ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఆ బాధ వీరితో పంచుకోకూడదు
Samatha
24 August 2026
జీవితంలో ప్రతి ఒక్కరూ తమలోని భావోద్వేగాలను ఇతరులతో వ్యక్తపరుస్తూ ఉంటారు. అది ఏ విషయమైనా సరే పంచుకుంటారు.
ముఖ్యంగా కొంత మంది అయితే తమలోని బాధను, తనకు సంబంధించిన సమస్యలను మన తన అనే బేధం లేకుండా ఇతరులతో షేర్ చేసుకుంటారు.
అయితే ఆచార్య చాణక్యుడు, ఒక వ్యక్తి తన భావోద్వేగాలను నిమంత్రించుకోవాలని, తమలోని భావాలను కేవలం సరైన వ్యక్తికి మాత్రమే తెలియజేయాలని తెలిపాడు.
ఒక వ్యక్తి గొప్ప బలం తన ఆత్మవిశ్వాసం, సహనంలోనే ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు, వాటిని బయట పెట్టినప్పుడు తన బలహీనత బయటపడుతుంది. అది ప్రతిష్టను దెబ్బతీస్తుంది.
అందువలన మీ బాధలను, మీ సమస్యలను ఎప్పుడూ కూడా స్వార్థపరుల ముందు వ్యక్తపరచకూడదు. దీని వలన మీరు ఎగతాళికి గురి అయ్యే ఛాన్స్ ఉంది.
మిమ్మల్ని గౌరవించని వ్యక్తులకు కూడా మీ బాధలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పడం వ్యర్థం వారు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తారు.
అదే విధంగా బలహీనమైన మనసు ఉన్న వ్యక్తుల ముందు కూడా మీరు మీ బాధలను, భావోద్వేగాలను వ్యక్తపరచకూడదు. ఎందుకంటే వారు మిమ్మల్ని మరింత ఆందోళనకు గురి చేస్తారు.
మరీ మీ భావోద్వేగాలను ఎవరితో పంచుకోవాలి అంటే? నిజమైన స్నేహితుడు, మీ మేలు కోరే బంధువు, ఉపాధ్యాయుడితో మీ భావోద్వేగాలను పంచుకోవాలంట.