రోగనిరోధక శక్తి పెరుగుదల: జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వర్షాకాలంలో వ్యాపించే ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న ఆహారం త్వరగా అరిగి, కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు తగడానికి ఇది ఎంతో దోహదపడుతుంది.
మలబద్ధకం నివారణ: జామ పండులో ఉండే పీచు పదార్థం పేగు కదలికలను సులభతరం చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య సమర్థవంతంగా నివారించబడి, పేగుల ఆరోగ్యం బాగుంటుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ: జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పీచు ఎక్కువ ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించి, మధుమేహం ఉన్నవారికి అద్భుతమైన పండు.
బరువు తగ్గడంలో సహాయం: తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు ఉన్న జామకాయ తింటే కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. అనవసరమైన ఆకలి కోరికలను తగ్గించి, కేలరీల వినియోగాన్ని అదుపు చేస్తూ బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యం పటిష్టం: ఇందులోని పొటాషియం, సోడియం, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది బిపి ని అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటి చూపు మెరుగుపడుతుంది: జామలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. రేచీకటి, కంటిశుక్లం, వయస్సుతో వచ్చే చూపు మందగించే సమస్యలను నివారించడంలో ఇది తోడ్పడుతుంది.
మృదువైన చర్మ సౌందర్యం: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు లికోపీన్ చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. చర్మానికి మంచి మెరుపును ఇస్తూ, చర్మ కణాలను కాపాడి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
ఒత్తిడి తగ్గుతుంది: జామకాయలో ఉండే మెగ్నీషియం ధాతువు నాడులు, కండరాలను ప్రశాంతపరుస్తుంది. శారీరక, మానసిక అలసటను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి సహాయపడుతుంది.