August 24, 2026
Subhash
ఈ రోజుల్లో నడక అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు వాకింగ్ చేయాలని వైద్యులు పదేపదే సూచిస్తున్నారు. ఇది అందరికి తెలిసిందే.
అయితే కొందరు వాకింగ్ చేస్తే రోజు ఎన్ని అడుగులు నడవాలి..?ఎంత దూరం నడిస్తే కిలోమీటర్ అవుతుంది అనే విషయం తెలియదు. ఎన్ని అడుగులు నడిస్తే ఒక కిలోమీటర్ అవుతుందో తెలుసుకుందాం..
ఒక కిలోమీటరు దూరం నడవడానికి సగటున మనుషులు 1,250 నుండి 1,550 అడుగులు (Steps) నడవాల్సి ఉంటుందని గుర్తించకోండి. అయితే అడుగు దూరం బట్టి కూడా క్యాలిక్‌లేట్ ఉంటుంది.
సాధారణ నడక (Normal Walk): దాదాపు 1,300 - 1,400 అడుగులు. వేగంగా నడిస్తే (Speed Walk/Jogging): దాదాపు 1,000 - 1,200 అడుగులు (అడుగుల మధ్య దూరం పెరుగుతుంది).
ప్రతి ఒక్కరి ఎత్తును బట్టి వారు వేసే అడుగు పరిమాణం మారుతుంది. ఎత్తు ఎక్కువ ఉన్నవారు తక్కువ అడుగులు వేస్తారు. పొట్టిగా ఉన్నవారు ఎక్కువ అడుగులు వేయాల్సి వస్తుంది.
ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 10,000 అడుగులు నడవాలని చెబుతారు వైద్యులు. ఇది దాదాపు 7.5 నుండి 8 కిలోమీటర్ల దూరంతో సమానం.
రోజూ కనీసం 3 నుండి 4 కిలోమీటర్లు (సుమారు 4,000 - 5,000 అడుగులు) నడవడం గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలా ప్రతి రోజు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు నడవడం అలవాటు చేసుకుంటే వివిధ రకాల వ్యాధులు దూరమవుతాయని వైద్యులు చెబుతుంటారు.