Andhra Pradesh: ఇంటర్‌ విద్యార్థులు గొడవపడ్డారనీ.. శిరోముండనం చేయించిన కాలేజీ యాజమాన్యం!

|

Nov 29, 2023 | 7:42 AM

నంద్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో సోమవారం రాత్రి సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం వారిని దండించడం కోసం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలో మంగళవారం విద్యార్థులను కర్రతో కొట్టించారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి చెయ్యి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరో ఆరుగురు విద్యార్థులకు కాలేజీ సిబ్బంది శిరోముండనం చేయించారు..

Andhra Pradesh: ఇంటర్‌ విద్యార్థులు గొడవపడ్డారనీ.. శిరోముండనం చేయించిన కాలేజీ యాజమాన్యం!
Tonsure To Students
Follow us on

నంద్యాల, నవంబర్‌ 29: నంద్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో సోమవారం రాత్రి సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం వారిని దండించడం కోసం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలో మంగళవారం విద్యార్థులను కర్రతో కొట్టించారు. దీంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి చెయ్యి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరో ఆరుగురు విద్యార్థులకు కాలేజీ సిబ్బంది శిరోముండనం చేయించారు. దీంతో ఈ విషయం పట్టణమంతా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరో ఘటన: దస్తావేజు లేఖరి దారుణ హత్య..ఇంటి వద్దే తుపాకీతో కాల్చిన వైనం

ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అతని ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి భార్య, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లలపాడుకు చెందిన కాట్రగడ్డ ప్రభాకర్‌ (60) సమీపంలోని అనంతపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద భూ సెటిల్‌మెంట్‌లు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటాడు. దీనిలో భాగంగా నిత్యం పలువురు ఆయన ఇంటికి వెళ్లి ఆయనను కలిసి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో కారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్‌ ఇంటికి వచ్చారు. వాళ్లు ఆయనతో నగదు గురించి మాట్లాడటం విన్న భార్య సావిత్రి ఇది భూమికి సంబంధించిన విషయమై ఉంటుందని భావించి లోపలికి వెళ్లిపోయింది.

అలా వెళ్లిన రెండు నిమిషాలకే తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆమె కంగారుగా బయటకు వచ్చింది. అప్పటికే ప్రభాకర్‌ రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉన్నాడు. అనంతరం దుండగులు ఇద్దరూ కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్పీ జగదీష్‌ ఘటనా స్థలాన్ని, సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎక్కువగా భూమి సెటిల్‌మెంట్లు చేస్తుంటారని, ఆ కోణంలోనే హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచాని వేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.