Weather Alert: ఏపీలో ఆ మండలాల్లో రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

|

May 31, 2023 | 6:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గురువారం రోజున దాదాపు 15 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. అలాగే శుక్రవారం 302 మండలాల్లో కూడా ఈ ప్రభావం ఉందని పేర్కొన్నారు.

Weather Alert: ఏపీలో ఆ మండలాల్లో రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Heat
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గురువారం రోజున దాదాపు 15 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. అలాగే శుక్రవారం 302 మండలాల్లో కూడా ఈ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం రోజున అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం,నాతవరం, సబ్బవరం మండలాలు, కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని మండలాలు, విజయనగరం జిల్లాలో జామి, కొత్తవలస మండలాలు అలాగే విశాఖలోని పద్మనాభం మండలంలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు.

అయితే బుధవారం నాడు కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.4°C, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో 43°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, 6 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు. వడగాల్పులు, అకాల వర్షాలు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద ఉండకూడదని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..