YSRCP VS Janasena and TDP: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ కామెంట్లతో రాజకీయ రచ్చ మొదలైంది. మంత్రి జోగి రమేష్ కౌంటర్ కామెంట్లతో పొలిటికల్ భోగి మంటలు అంటుకున్నాయి. ఒక మాట మంటలు పుట్టించింది. రాజకీయ తుఫాన్ రేపింది. జోగి రమేష్‌పై జనసేన, టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. తాను అన్నదాంట్లో తప్పేం లేదంటున్నారు మంత్రి గారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగ్గేదే లేదంటున్నారు. ఈ మాటల మంటలు ఏపీ రాజకీయాన్ని మరింత మండిస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అమరావతి సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్లు కాక రేపాయి. తీవ్ర దుమారానికి దారి తీశాయి. జోగి కామెంట్లపై జనసేన లీడర్లు కేడర్ మండిపడ్డారు. ఏపీలో పలుచోట్ల మంత్రి జోగి రమేష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో అమలాపురం వెళ్లిన మంత్రి జోగి రమేష్‌ని అడ్డుకునేందుకు జనసేన నేతలు యత్నించారు. మంత్రిని అడ్డుకునేందుకు అమలాపురం గడియారస్తంభం సెంటర్లో దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు జనసేన నేతలు సిద్ధమయ్యారు. పోలీసులు అప్రమత్తం అయి వాళ్లను అడ్డుకున్నారు. అయితే, మంత్రి జోగి రమేష్ మాటల వల్ల బీసీలకు చెడ్డపేరు వస్తోందంటున్నారు విశాఖ టీడీపీ నేతలు.
మహిళల అదృశ్యం గురించి మాట్లాడిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును మంత్రి రోజా తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌కు ఏ మాత్రం రాజకీయ అవగాహన లేదని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కారణంగా చాలా మంది మహిళలు మిస్సయ్యారని రోజా ఆరోపించారు.
అటు మంత్రి జోగి రమేశ్ కూడా పవన్ కల్యాణ్, చంద్రబాబులపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఎవరు అనుచితంగా మాట్లాడినా తాము సహించమని జోగి రమేశ్ అన్నారు.
మొన్నటి వరకు వాలంటీర్ల వ్యవస్థ, ఇప్పుడు మహిళల మిస్సింగ్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. వైసీపీ, జనసేన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..