ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఎవ్వరూ తగ్గట్లేదుగా

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో.. ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా పోటీకి సై అంటున్నాయి.

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఎవ్వరూ తగ్గట్లేదుగా
Andhra Politics
Follow us

|

Updated on: Dec 31, 2023 | 6:34 PM

కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. రాబోయే మూడు నెలల్లోనే ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతాయని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో ఏపీలోని మొత్తం 175 స్థానాలు గెలుచుకుంటామని అధికార వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే.. వై నాట్ పులివెందుల అని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.

టీడీపీ, జనసేన కూటమితో వైసీపీని ఓడిస్తామని చంద్రబాబు అండ్ టీమ్ ప్రకటనలు చేస్తుంటే.. వైసీపీ నుంచి రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంది. టీడీపీ సొంతంగా 175 స్థానాలకు పోటీ చేస్తుందా అని వైసీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు.

ప్రత్యేక హోదా సహా ఏపీకి హక్కుగా దక్కాల్సిన విభజన హామీలను సాధిస్తామంటూ కొత్త పార్టీతో ముందుకొచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన.. 175 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఏపీలో సత్తా చాటుతామని ప్రకటనలు చేస్తుండటంతో.. రాబోయే కాలంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..