AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

72 ఏళ్ల వృద్ధురాలికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన యువకుడు.. ఈ తర్వాతే అసలు ట్విస్ట్..!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో నమోదైన కేసును ఛేదించిన పోలీసులు, డిజిటల్ ముఠా యవ్వారాన్ని బయటపెట్టారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్పకు చెందిన విరుపాక్షి అనే యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు, డిజిటల్ ముఠా అసలు బాగోతాన్ని ఛేదించారు.

72 ఏళ్ల వృద్ధురాలికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన యువకుడు.. ఈ తర్వాతే అసలు ట్విస్ట్..!
Digital Scam
Raju M P R
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 4:01 PM

Share

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో నమోదైన కేసును ఛేదించిన పోలీసులు, డిజిటల్ ముఠా యవ్వారాన్ని బయటపెట్టారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్పకు చెందిన విరుపాక్షి అనే యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు, డిజిటల్ ముఠా అసలు బాగోతాన్ని ఛేదించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు నిందితుడిని హాజరు పరిచిన పోలీసులు ముఠా విదేశీ లింకులను, కార్యకలాపాలను బయట పెట్టారు.

మదనపల్లిలోని అమ్మినేని వీధికి చెందిన ఆవుల విజయలక్ష్మి అనే 72 ఏళ్ల వృద్ధురాలికి వాట్సాప్, వీడియో కాల్స్ తో బెదిరింపులకు పాల్పడిన ముఠా రూ. 92.70 లక్షల దాకా కాజేసినట్లు తేల్చారు. సీబీఐ, ఈడీ అధికారులమని హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో కుటుంబ సభ్యులు చిక్కుకున్నారని కేసులు పెడతామని బెదిరించారు. పాస్‌పోర్టులను బ్లాక్ చేస్తామంటూ భయపెట్టారు. ఈ మేరకు రెండు రోజుల్లోనే పలు దఫాలుగా రూ. 92.70 లక్షల దాకా నగుదును ట్రాన్స్‌ఫర్ చేసుకుని కాజేసిన ముఠా, డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడింది.

గత ఏడాది సెప్టెంబర్ లో విజయలక్ష్మి చేసిన ఫిర్యాదు పై దర్యాప్తు చేపట్టిన మదనపల్లి వన్ టౌన్ పోలీసులు, ఎట్టకేలకు డిజిటల్ అరెస్ట్ ముఠాలోని సభ్యుడిని అరెస్టు చేశారు. రూ. 10లక్షల నగదు, సెల్ ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్పకు చెందిన విరూపాక్షి(24) ఈ ముఠాలో సభ్యుడిగా భావిస్తున్న పోలీసులు కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు. కాంబోడియా, కువైట్ కేంద్రంగా ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us