AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం సినిమా రా నాయనా.. 2016లో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.. 10 ఏళ్లైనా అదే క్రేజ్..

దాదాపు పదేళ్ల క్రితం అంటే 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. అందమైన ప్రేమకథగా మొదలై.. చివరకు ఊహించని విషాదాన్ని మిగిల్చి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టేలా చేసింది. నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఆ మూవీకి ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆ మూవీ ఏంటో మీకు తెలుసా.. ?

Cinema : ఏం సినిమా రా నాయనా.. 2016లో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.. 10 ఏళ్లైనా అదే క్రేజ్..
Sairat Movie
Rajitha Chanti
|

Updated on: Apr 30, 2026 | 2:58 PM

Share

స్టార్ నటీనటులు లేరు.. భారీ బడ్జెట్ లేదు. కానీ థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసింది ఆ సినిమా. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన ఆ మూవీ యావత్ భారతదేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 2016లో విడుదలైన ఈ మూవీకి ఇప్పటికీ ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఈ సినిమా విడుదలై పదేళ్లు కావడంతో ఆ సినిమాలోని నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే సైరత్. మరాఠీలో తెరకెక్కించిన ఈ చిత్రానికి నాగరాజ్ మంజులి దర్శకత్వం వహించారు. సైరత్.. ఇదో అందమైన ప్రేమకథ. ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి ఆర్చీ, తక్కువ వర్గానికి చెందిన పర్షాల మధ్య చిగురించిన అందమైన ప్రేమకథ.. చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా. నాగరాజ్ మంజులే ఈ కథ ద్వారా గ్రామీణ వాస్తవికతను, కుల వివక్షను, సామాజిక అణచివేతను చాలా ప్రభావవంతంగా చిత్రీకరించారు. దీనివల్ల ప్రేక్షకులు భావోద్వేగంగా కనెక్ట్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

సంగీత దర్శకులు అజయ్-అతుల్ స్వరపరిచిన సంగీతం ‘సైరత్’ చిత్రానికి అతిపెద్ద బలం అని చెప్పొచ్చు. యాద్ లగ్లా.. జింగాత్.. సైరత్ ఝాలాజీ వంటి పాటలు ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ కొద్ది దూసుకుపోతాయి. రింకు రాజ్‌గురు (అర్చి), ఆకాష్ తోసర్ (పరాష్య) పూర్తిగా కొత్త ముఖాలు. వారి సహజమైన నటన, కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు. దీనివల్ల కథ మరింత వాస్తవికంగా అనిపించింది. ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

2016లోనే రూ.100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి సంచలనం సృష్టించింది ఈ మూవీ. ఈ కథ ఆధారంగా ఇతర భాషల్లో కూడా సినిమాలు వచ్చాయి. కానీ సైరత్ సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆర్చీ-పర్ష్యాల ప్రేమకథ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సైరత్’ విజయం కేవలం బాక్సాఫీస్‌కే పరిమితం కాలేదు. యావత్ దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు యూత్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర