AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC 2026 Answer Key: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ CBT 1 ఆన్సర్‌ కీ విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సీబీటీ 1 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి..

RRB NTPC 2026 Answer Key: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ CBT 1 ఆన్సర్‌ కీ విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
RRB NTPC Graduate Answer Key
Srilakshmi C
|

Updated on: Apr 07, 2026 | 3:23 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 7: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సీబీటీ 1 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కీతోపాటు అభ్యర్ధుల రెస్సాన్స్‌షీట్లను, మాస్టర్ క్వశ్చన్‌ పేపర్‌లను కూడా షిఫ్టుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జవాబు కీ లింక్ ఏప్రిల్ 6 సాయంత్రం 4 గంటల నుండి ఏప్రిల్ 12 రాత్రి 11:55 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ పరీక్ష 2026 ప్రాథమిక ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అభ్యర్థులు ఈ ఆన్సర్‌ కీలపై ఏప్రిల్ 12, 2026వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌ విధానంలో తెలపవచ్చు. అయితే అభ్యంతరాలను తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.50 చొప్పున రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఆయా ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్‌గా సూచిస్తే ఈ రుసుమును తిరిగి రిఫండ్ చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఆ వెనువెంటనే ఫలితాలను కూడా వెల్లడిస్తారు. కాగా మొత్తం 5,810 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మార్చి 16 నుంచి 27వ తేదీ వరకు సీబీటీ 1 పరీక్షలు జరిగాయి. సీబీటీ 1 పరీక్షలో కనీస ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సీబీటీ 2 పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. అనంతరం తుది ఎంపిక జాబితా విడుదలవుతుంది. కాగా

ఇవి కూడా చదవండి

గ్రాడ్యుయేట్ కేటగిరీలో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌ పరీక్ష 2026 ప్రాథమిక ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us