Andhra Pradesh: సినీఫక్కీలో స్మగ్లింగ్‌.. రూ.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

సినీ ఫక్కీలో ఓ కంటైనర్‌ లోపల గంజాయిని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీ చేయగా దాదాపు రూ.5 కోట్ల విలువైన గంజాయిని బయటపడింది. దీంతో వాహనం డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన గంజాయిని సీజ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

Andhra Pradesh: సినీఫక్కీలో స్మగ్లింగ్‌.. రూ.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
Ganja Smuggling
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2023 | 4:35 PM

చిలమత్తూరు, డిసెంబర్‌ 14: సినీ ఫక్కీలో ఓ కంటైనర్‌ లోపల గంజాయిని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీ చేయగా దాదాపు రూ.5 కోట్ల విలువైన గంజాయిని బయటపడింది. దీంతో వాహనం డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన గంజాయిని సీజ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద బుధవారం (డిసెంబర్‌ 13) పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుపడింది. సినీ ఫక్కీలో కంటైనర్‌ లోపల గంజాయిని ఉంచి బెంగళూరుకు రవాణా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 500 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు కంటైనర్‌లో గుర్తించారు. పట్టుబడిన గంజాయి కంటైనర్‌ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి విజయవాడ, కడప మీదుగా బెంగళూరుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే పట్టుబడిన డ్రైవర్‌, క్లీనర్‌కు సంబంధించిన వివరాలు కూడా పోలీసులు మీడియాకు వెల్లడించ లేదు.

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బెంగళూరు ప్రాంతంలో సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భారీ మొత్తంలో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్‌ ముఠాలోని సభ్యుల మధ్య విభేదాల తలెత్తడంతో కంటైనర్‌ గంజాయి వస్తున్న సమాచారం బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. కంటైనర్‌లో గంజాయి రవాణా వెనుక పెద్ద తలకాయల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.