Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఓకే ఐడీతో రెండు, మూడు ఓట్లు.. టీడీపీ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది.. సీఈసీకి వైసీపీ ఎంపీల ఫిర్యాదు..

బోగస్ ఓటర్ల అంశం మరోసారి రాజకీయాలను వేడెక్కించింది. లక్షల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఎంపీలు గురువారం సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh: ఓకే ఐడీతో రెండు, మూడు ఓట్లు.. టీడీపీ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది.. సీఈసీకి వైసీపీ ఎంపీల ఫిర్యాదు..
YSRCP MP Vijayasai Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 14, 2023 | 4:38 PM

బోగస్ ఓటర్ల అంశం మరోసారి రాజకీయాలను వేడెక్కించింది. లక్షల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో గురువారం సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లుగా టీడీపీ సానుభుతిపరుల పేరు నమోదు చేశారని ఎంపీలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిషాల్లో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని తెలిపారు. ఈ దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్‌వెవల్‌ అధికారులపై టీడీపి నేతలు దాడులు చేస్తున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. వైఎ‍స్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులను బీఎల్‌ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు సీఈసీని కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సహా ఉన్నతాధికారులను కలిసినట్లు తెలిపారు. టీడీపీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ “మై పార్టీ డాష్ బోర్డ్” యాప్ ద్వారా ప్రజల కుల, మత, వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అనే విషయాన్ని ఈసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఈ డాటాను అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సర్వర్ లో భద్రపరుస్తున్నారన్నారు. సేవా మిత్ర పేరుతో గతంలో ఇలాగే డేటా సేకరించారని.. వారిపై కేసులు కూడా నమోదు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒక వ్యక్తి కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘించేలా అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని తెలిపారు.

ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి 30 ఇళ్లకు ఒక టీడీపీ కార్యకర్తను నియమిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ కార్యకర్త మానిఫెస్టో రూపొందించే కసరత్తు ఆ 30 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి లండన్ సర్వర్ లో భద్రపరుస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారిగా లేక ఎన్నికల కమిషన్ అధికారిగా ప్రజలను మభ్యపెడుతూ వివరాలు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి తమ ఓటర్లు కాదు అనుకుంటే వారి ఓట్లు తొలగించేలా తప్పుడు దరఖాస్తులు చేస్తున్నారన్నారు.

బాబు ష్యూరిటీ పేరుతో ఆ కుటుంబాలకు హామీ కార్డులు ఇస్తున్నారని.. అలాగే దొంగ ఓట్లు కూడా చేర్చుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒక పేరులో స్పెల్లింగ్ కాస్త మార్చి మరలా మరలా పేర్లు నమోదు చేస్తున్నారని.. అలాగే తెలంగాణలో నివసిస్తున్న వారి పేర్లను కూడా ఇక్కడ చేర్చుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఓటర్స్ ఏపీలో ఓటు వేయించేలా ఒక డ్రైవ్ నిర్వహించే ప్రయత్నం టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ సురేష్ కోనేరు పేరిట ఒక ఫిర్యాదు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేశారన్నారు. ఒక 10 లక్షల ఓటర్లు నకిలీ ఓటర్లు అంటూ పేర్కొన్నారు. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు వెరిఫై చేసి 1-2% తేడాలు మినహా అంతా కరెక్ట్ అని తేల్చారన్నారు.

టీడీపీ ఎన్నికల సంఘం అధికారుల సమయాన్ని వృధా చేసేలా తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని.. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ మాత్రమే ఫిర్యాదు చేసేలా ఉండాలన్నారు. సురేష్ కోనేరు వంటి వ్యక్తులు ఇచ్చే బల్క్ ఫిర్యాదులపై సమయం వృధా చేసుకోవద్దంటూ సూచించారు. ఓకే ఐడీతో రెండు మూడు ఓట్లు నమోదు అయ్యాయి. ఆధార్ సీడింగ్ చేస్తే ఎలాంటి దొంగ ఓట్లు తొలగించవచ్చు. ఇదే విషయాన్ని మేము ఈసీ దృష్టికి తీసుకొచ్చామని విజయసాయిరెడ్డి మీడియాతో పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..