
Liquor Seized: ఏపీలో అక్రమ మద్యంపై ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్‌గా ఎన్టీఆర్ జిల్లాలో కోట్ల విలువైన ఇల్లీగల్ లిక్కర్‌ను రోడ్డు రోలర్‌తో తొక్కించి పచ్చడిపచ్చడి చేశారు పోలీసులు. వంద కాదు, రెండొందలు కాదు, ఏకంగా 47వేల మద్యం బాటిల్స్ రోడ్డు రోలర్ కింద నలిగి పచ్చడైపోయాయ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 46వేల 180 లిక్కర్ బాటిల్స్‌ను రోడ్డుపై పేర్చి, రోలర్‌తో పచ్చడిపచ్చడి చేయించారు పోలీసులు. ఇవన్నీ జిల్లా అంతటా పట్టుబడిన అక్రమ మద్యం కాదు, కేవలం మైలవరం సర్కిల్‌లో మాత్రమే సీజ్ చేశారు నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నారాయణస్వామి, ఏసీపీ ప్రసాద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఒక్క మైలవరంలోనే కాదు, స్టేట్ వైడ్‌గా లిక్కర్ డిమోలిషన్ ఆపరేషన్ జరుగుతోంది.
అక్రమ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి, కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని జేసీబీలతో, రోడ్డురోలర్‌తో తొక్కిస్తూ మట్టిలో కలిపేస్తున్నారు పోలీసులు. అక్రమ మద్యంపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోన్న ఖాకీలు, పెద్దఎత్తున నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను పట్టుకుని ధ్వంసం చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ఊరు చివరకు తీసుకొచ్చి రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు పోలీసులు. మైలవరంలో ధ్వంసంచేసిన నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ విలువ కోట్లల్లో ఉంటుందన్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి