Aghori: లేడీ అఘోరీ చెర నుంచి శ్రీవర్షిణికి విముక్తి.. ఇక నాకు సంబంధం లేదంటూ..
ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీకి విముక్తి లభించింది. ఎట్టకేలకు అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీని విడిపించారు పోలీసులు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో ఆమెను గుజరాత్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. శ్రీవర్షిణీని తల్లిదండ్రులు మంగళగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.

ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీకి విముక్తి లభించింది. ఎట్టకేలకు అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీని విడిపించారు పోలీసులు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో ఆమెను గుజరాత్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. శ్రీవర్షిణీని తల్లిదండ్రులు మంగళగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. వాళ్ల కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. శ్రీవర్షిణి పేరెంట్స్ సైతం పోలీసులతో గుజరాత్ వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్‌లో నిద్రిస్తున్న వాళ్లిద్దరిని అర్థరాత్రి పట్టుకున్నారు పోలీసులు. లేడీ అఘోరీ దగ్గర ఉన్న శ్రీవర్షిణీని అదుపులోకి తీసుకొని గుంటూరుకి తరలించారు. ఆ ఘటనను లేడీ అఘోరీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమను బలవంతంగా విడదీస్తున్నారని మండిపడింది. ఇకపై శ్రీవర్షిణికి ఏం జరిగినా తనకు సంబంధం లేదని అఘోరీ చెప్పింది.
అయితే, కొద్దీ రోజుల క్రితం ఇంట్లో నుండి అఘోరీ వద్దకు వెళ్ళిపోయింది శ్రీ వర్షిణి. అఘోరి మాయలో పడి శ్రీవర్షిణి జీవితం పాడు చేసుకుంటోందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురును అఘోరీ కిడ్నాప్ చేసిందంటూ ఆమె ఫ్యామిలీ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
అయితే శ్రీవర్షిణి బ్రదర్ విష్ణు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. శ్రీ వర్షిణి కేర్ టేకర్‌గా చెప్పుకుంటున్నారు విష్ణు. అయితే అంతకుముందు అఘోరీకి శ్రీవిష్ణు.. తన సోదరిని వర్షిణిని పరిచయం చేశారు. ఇప్పుడు అతడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




