AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేక్‌ కట్‌ చేసి మరీ.. కోళ్ల పందేలు షురూ.. డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది.. ఎక్కడివాళ్లక్కడ పరార్‌!

బరులు గీశారు. సంక్రాంతి సమరానికి కోళ్లు కొక్కొరొకో అన్నాయి. పందెం రాయుళ్లు.. కేక్‌ కట్‌ చేసి మరీ.. కోళ్ల పందేలను షురూ చేశారు. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేలకు తెర లేపారు. ఇంతలోనే కలకలం.. పందెం రాయుళ్లలో కలవరం. సినిమా క్లైమాక్స్‌లో వచ్చినట్లు వాళ్లొచ్చేశారు. అంతే ఎక్కడివాళ్లక్కడ పరార్‌! పందేలను అడ్డుకున్న పోలీసులు.. కోళ్ల కాళ్లకు కట్టిన కత్తులను స్వయంగా విప్పి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

కేక్‌ కట్‌ చేసి మరీ.. కోళ్ల పందేలు షురూ.. డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది.. ఎక్కడివాళ్లక్కడ పరార్‌!
Ockfight
Balaraju Goud
|

Updated on: Jan 14, 2026 | 8:12 AM

Share

బరులు గీశారు. సంక్రాంతి సమరానికి కోళ్లు కొక్కొరొకో అన్నాయి. పందెం రాయుళ్లు.. కేక్‌ కట్‌ చేసి మరీ.. కోళ్ల పందేలను షురూ చేశారు. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేలకు తెర లేపారు. ఇంతలోనే కలకలం.. పందెం రాయుళ్లలో కలవరం. సినిమా క్లైమాక్స్‌లో వచ్చినట్లు వాళ్లొచ్చేశారు. అంతే ఎక్కడివాళ్లక్కడ పరార్‌!

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కోడి పందేలు షురూ అయ్యాయి. ముహూర్తం చూసి మరీ కొబ్బరికాయ కొట్టారు పందెం రాయుళ్లు. ఆ తర్వాత, పందెం కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి, వాటిని బరిలో వదిలి, కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. సడెన్‌గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో, పందెం రాయుళ్లంతా పరుగో పరుగు అంటూ పారిపోయారు. పందేలను అడ్డుకున్న పోలీసులు.. కోళ్ల కాళ్లకు కట్టిన కత్తులను స్వయంగా విప్పి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక కోనసీమలోని రాజోలులో కూడా సేమ్‌ సీన్‌ చోటు చేసుకుంది. కోడి పందేలు వేయడానికి సిద్ధాంతితో ముహూర్తం పెట్టించి కేక్‌ కట్ చేసి మరీ, కోడి పందేలకు తెర లేపారు నిర్వాహకులు. కోడి పందేలు చూసేందుకు స్టేడియం ఏర్పాటుచేసి, చుట్టూ జనం కూర్చునే విధంగా వసతులు కల్పించారు. వరుసగా 6 పందేలు గెలిచిన పందెం రాయుడికి బుల్లెట్ బైక్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇంతలోనే పోలీసులు రెయిడ్‌ చేయడంతో.. పందెం రాయుళ్లు కోళ్లను చంకలో పెట్టుకుని పరుగులు తీశారు.

ఇక ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు మాత్రం క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇవ్వలేదు. కొన్ని రోజులు ముందస్తుగానే రెయిడ్స్‌ మొదలుపెట్టారు. కోడి పందేలు నిర్వహించడం, వాటిలో పాల్గొనడం తప్పని, అది చట్టరీత్యా నేరమని ప్రచారం ప్రారంభించారు. పెనుగంచిప్రోలు MRO, జగ్గయ్యపేట సీఐ….జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో తిరుగుతూ, కనిపించిన బరులన్నింటిని ధ్వంసం చేస్తున్నారు. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో కోడి పందేల బరులు సిద్ధం చేస్తున్న అక్కయ్య గౌడ్‌కి నోటీసులు జారీ చేశారు. కాగా, కోనసీమ నుంచి కృష్ణా జిల్లా వరకు డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది అంటూ వాపోతున్నారు పందెంరాయుళ్లు. పోలీసుల దాడులు వాళ్లను పరేషాన్‌ చేస్తున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..