PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్

|

May 08, 2024 | 8:09 AM

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు.

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్.. రోడ్ షోలు, సభలతో ప్రధాని బిజీ షెడ్యూల్
Modi
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. నిన్న రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేసిన ప్రధాని మోదీ.. కాసేపట్లో వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. లక్ష్మీపూర్‌లో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జన సభలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొంటారు. తెలంగాణలో రెండు బహిరంగ సభలు తరువాత తిరిగి మరోసారి ఏపీకి వెళ్లనున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.35 నిముషాలకు తిరుపతి నుంచి హెలికాఫ్టర్‌లో రాజంపేటలోని కలికిరికి చేరుకుంటారు. సా.4 గంటలకు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాత సాయంత్రం రాజంపేట సభా ప్రాంగణం నుంచి మోడీ హెలికాఫ్టర్‌లో బయల్దేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి వస్తారు.

గన్నవరం నుంచి రోడ్డు మార్గాన బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుని రాత్రి 7గంటలకు ప్రచారంలో పాల్గొంటారు. అయితే గన్నవరం చేరుకున్న ప్రధాని సాయంత్రం 6 నుంచి 7 వరకు స్టేడియం టు బెంజిసర్కిల్ వరకు గంటసేపు బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన రోడ్ షో లో పాల్గొంటారు. రాజంపేట, విజయవాడలో జరిగే సభలకు, రోడ్ షోలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ పాల్గొంటారు. అనంతరం గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు ప్రధాని మోడీ. ప్రధాని విజయవాడ పర్యటన నేపథ్యంలో రోడ్డు షోకు 5వేల మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు సీపీ. నరేంద్ర మోడీ రోడ్ షోలో VVIP,VIPలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీస్‌ సిబ్బందిని అలర్ట్ చేశారు. పోలీస్ సిబ్బందికి కేటాయించిన పాయింట్లలో అప్రమత్తంగా ఉండాలని.. ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. పీఎం బందోబస్త్‌లో ఆరుగురు IPSలు, DCP, ఏడుగురు SPలు, ADCPలు 22మంది, ACPలు 50, 136 SIలు పాల్గొంటున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నగరంలో రెడ్ జోన్ ఏర్పాటుచేశారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు, ఓల్డ్ పి.సి.ఆర్. జంక్షన్ నుండి బెంజ్ సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు పోలీసులు. ఈ ప్రాంతంలో డ్రోన్స్ గాని, బెలూన్స్ ని నిషేదించారు. రోడ్‌ షో చేసే మార్గంలో ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..