Vizag: సూపర్ న్యూస్ అంటే ఇది కదా.. విశాఖకు మహర్దశ.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు

విశాఖ జిల్లాలో మరో భారీ ప్రాజెక్ట్‌కు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ఈ నెల 29న ప్రధానితో శంకుస్థాపనకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.

Vizag: సూపర్ న్యూస్ అంటే ఇది కదా.. విశాఖకు మహర్దశ.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు
Vizag
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2024 | 10:15 AM

విశాఖ జిల్లాలో మరో భారీ ప్రాజెక్ట్‌కు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు ఈ నెల 29న ప్రధానితో శంకుస్థాపనకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. రూ.85 వేల కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ఉపాధి లభించే ఈ ప్రాజెక్టుతో విశాఖ పారిశ్రామిక ప్రతిష్ట మరింత పెరగనుంది. విశాఖను గ్రోత్ హబ్‌గా ప్రకటించిన కేంద్రం ఆ మేరకు కార్యాచరణను ప్రారంభించి, ముందుకు వెళ్తోంది. అదే రోజు రైల్వే జోన్‌కూ ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రా యూనివర్సిటీలో పబ్లిక్ మీటింగ్‌కు ఏర్పాట్లను ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

విశాఖను వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా భావించి గ్రోత్ హబ్ సెంటర్‌గా ప్రకటించింది కేంద్రం. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అవ్వకుండా వచ్చే ఐదేళ్లలో విశాఖను శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని నిర్ణయించింది నీతి అయోగ్. అందులో భాగంగానే ఒక భారీ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగింది. దాని ప్రతిబింబమే అచ్యుతాపురం మండలం పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు. గత ప్రభుత్వ హయంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని భావించినా పలు కారణాలతో కార్యరూపంలోకి తేలేకపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

85 వేల కోట్ల పెట్టుబడి, 25 వేల ఉద్యోగాలు..

రూ.85 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ఈ నెల 29న ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి దొరకనుంది. 2032 నాటికి ఈ ప్లాంట్ నుంచి 60 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తులో అధిక భాగం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇందులో 50 శాతం వాటాను ఏపీజెన్కోతో పెట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్టీపీసీ, జెన్కోల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

రైల్వే జోన్‌కు కూడా శంకుస్థాపన.?

ఇదే పర్యటనలో ప్రధానితో విశాఖ రైల్వేజోన్‌కు కూడా శంకుస్థాపన చేయించాలన్న ప్రణాళిక కూడా ఉంది. అయితే వాల్తేరు డివిజన్‌పై మరికొంత స్పష్టత రావల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు దానిపై దృష్టి సారించారు. మరోవైపు ప్రధాని పర్యటన నేపధ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రారంభించింది.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..