నానబెట్టిన వాల్ నట్స్ తింటే శరీరంలో జరిగే మార్పులివే..
Narender Vaitla
17 November 2024
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి నానబెట్టిన వాల్ నట్స్ మెరుగైన ఫలితాలను ఇస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
వాల్ నట్స్ లో పుష్కలంగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా రాత్రంతా నానబెట్టిన వాటిని తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతీ రోజూ నానబెట్టిన వాల్ నట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
వాల్ నట్స్ లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో నానబెట్టిన వాల్ నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ పేషంట్స్ కి నానబెట్టిన వాల్ నట్స్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ముడతలను దూరం చేయడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
మెరుగైన కంటి చూపు కోసం ప్రతీ రోజూ నానబెట్టిన వాల్ నట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపయోగపడుతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.