Andhra Pradesh: నేడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి

Andhra Pradesh: నేడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి

Narender Vaitla

|

Updated on: Nov 17, 2024 | 9:22 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలను ఈరోజు నిర్వహించనున్నారు. నారావారిపల్లెల్లో అంత్యక్రియలను నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నారావారిపల్లెకు చేరుకుంటున్నారు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు, సినీనటుడు నారా రోహిత్‌ తండ్రి, శాసనసభ మాజీ సభ్యుడు నారా రామ్మూర్తినాయుడు శనివారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన మధ్యాహ్నం 12.45 గంటలకు కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న రామ్మూర్తినాయుడి ఆరోగ్యం ఈ నెల 14వ తేదీన ఆరోగ్యం విషమించడంతో కుటంబ సభ్యులు ఏఐజీలో చేర్పించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతోన్న ఆయన గుండె వైఫల్యం చెందడంతో మృతి చెందారని ఏఐజీ ఆసుపత్రి అధికారులు తెలిపారు.

కాగా నేడు నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. కాసేపట్లో నారావారిపల్లెకు రామ్మూర్తినాయుడు భౌతికకాయం చేరుకోనుంది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్‌తో పాటు కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు పయనమయ్యారు. సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు నారావారిపల్లెకు చేరుకోనున్నారు. రామ్మూర్తినాయుడికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ నివాళులు అర్పించనున్నారు. అలాగే నారావారిపల్లెకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికార లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..