Anantapur district: యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌.. స్థానికంగా రచ్చ.. రచ్చ

అనంతపురంజిల్లా యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌ రచ్చ రేపింది. యాడికిలో పందుల కారణంగా ప్రజలు రోగాల బారినపడుతున్నారు.

Anantapur district: యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌.. స్థానికంగా రచ్చ.. రచ్చ
Pig Owners Fight
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 17, 2021 | 1:02 PM

అనంతపురంజిల్లా యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌ రచ్చ రేపింది. యాడికిలో పందుల కారణంగా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. దీంతో పందుల్ని వేరే ప్రాంతానికి తరలించాలని సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పంచాయతీ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. మినీ వ్యాన్‌లో పందులను తరలిస్తుండగా వాటి యజమానులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పందుల్ని వేరే ప్రాంతానికి తరలిస్తే తమకు జీవనోపాధి ఎలా అని ప్రశ్నించారు పందుల యజమానులు. సహనం కోల్పోయి బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను అక్కడున్న వాళ్లందరిపై చల్లారు. పందుల వ్యాన్‌కి అడ్డంతిరిగి బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పీక్‌కి వెళ్లింది. బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ పంచాయతీ సిబ్బందిపై చల్లడంతో అక్కడున్న వాళ్లంతా ప్రాణభయంతో పరుగు పెట్టారు. పందుల యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

కృష్ణా జిల్లా: మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి

కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద లిక్కర్ తాగిన మైకంలో ఇద్దరు యువకులు మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందాడు. పట్టణానికి చెందిన రాపానీ ఏసు, బత్తుల సాయికుమార్​ అనే ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్ దగ్గర్లో గురువారం రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలతో మొదలైన గొడవ.. ఇద్దరి మధ్య వాగ్వాదానికి, ఘర్షణకు దారితీసింది. సాయి కుమార్​పై గొడ్డలితో ఏసు దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్​ను స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వైద్యులు విజయవాడకు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్ చనిపోయాడు. ఈ ఘటనపై గుడివాడ టూటౌన్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా… 20 ఏళ్ల జైలు శిక్ష

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ కలకలం.. ఫస్టియర్ స్టూడెంట్ దుస్తులు విప్పించి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే