Andhra: కుంభమేళాకు వెళ్లారు.. పాపాలు పోగొట్టుకోడానికి కాదు.. మరికొన్ని పాపాలు చేయడానికి.. కట్ చేస్తే..
వారంతా కుంభమేళాకు వెళ్లారు.. పవిత్ర స్నానం చేసి పాపాలను కడిగేసుకోడానికి కాదండోయ్... మరికొన్ని పాపాలు చేయడానికి. అవును ఏపీలోని తాడేపల్లికి చెందిన పిక్ పాకెటింగ్ ముఠా కుంభమేళా సమయంలో అక్కడికి వెళ్లి తమ చేతివాటం ప్రదర్శించారు. బాగానే సొమ్ము పోగు చేసి ఇంటికి తిరిగివచ్చారు. కానీ....

భరత్, వర్ధన్ ఇద్దరూ స్నేహితులే..వీరితో పాటు మరో ముగ్గురు మిత్రులు కలిసే తిరుగుతుంటారు. వీరంతా గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటారు. అవారాగా తిరిగే వీరందరికి ఒక కామన్ ప్రొఫెషన్ ఉంది… అదే పిక్ పాకెటింగ్..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరై పెద్ద పెద్ద జాతర్లు, పండుగలు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడ వాలిపోతుంటారు. రోజుల కొద్దీ అక్కడే ఉండి ఆ తర్వాత తాడేపల్లి చేరుకుంటారు. అక్కడ చేసిన పిక్ పాకెట్ల ద్వారా లభించిన మొత్తాన్ని పంచుకుంటుంటారు. అయితే ఆదివారం రాత్రి వర్ధన్‌పై భరత్ తో పాటు మరో ముగ్గురు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వర్ధన్ చనిపోయాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఏం జరిగిందా అన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
భరత్, వర్ధన్ తో పాటు మరికొంత మంది ఫిబ్రవరిలో జరిగిన కుంభామేళాకు వెళ్లారు. అక్కడ చాలాకాలం ఉన్నారు. పోలీసులకు దొరక్కుండా పిక్ పాకెటింట్ చేశారు. అయితే ఆ డబ్బులు పంచుకునే క్రమంలో విబేధాలు వచ్చాయి. దీంతో భరత్ తన సొంత స్నేహితుడిపైనే కక్ష కట్టాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాత్రి పదకొండు గంటల సమయంలో వర్ధన్ ఒక్కడే ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న భరత్ అతని కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ఆ తర్వాత కత్తితో పొడిచారు. దీంతో తీవ్ర గాయాలైన వర్ధన్ అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భరత్ తో పాటు అతని స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పిక్ పాకెట్ చేస్తూ జీవనం సాగించే వీరి మధ్య తరుచూ వాటిని పంచుకునే విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయంటున్నారు స్థానికులు.
కుంభ మేళాలో విపరీంతగా ఆదాయాన్ని ఆర్జించిన వారిని చూశాం. అయితే ఇక్కడ ఏకంగా డబ్బులు పంచుకునే విషయంలో వచ్చిన మనస్పర్ధలు ఒకరి హత్యకు దారితీయడంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..