Pegasus Investigation: ఏపీలో మళ్లీ పెగాసస్, డేటా చౌర్యం వివాదం.. పొలిటికల్‌గా కాక రేపుతోంది. టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా పెట్టారన్న ఆరోపణలపై ఏర్పాటైన అసెంబ్లీ హౌస్ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ లబ్ది కోసం గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు.. హౌస్ కమిటీ నిర్ధారించింది. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలోనే… వ్యక్తుల డేటా.. ప్రయివేట్ సంస్థ చేతిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అప్పటి ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే కుట్ర జరిగిందన్నారు కమిటీ సభ్యులు. దీనిపై పోలీస్ విచారణ కూడా జరగాలన్నారు. అయితే పెగాసస్ వ్యవహారంపై ఏర్పాటుపై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా డేటా చౌర్యంపై ప్రధానంగా దృష్టి సారించింది. నాటి డేటా చౌర్యం వెనుకు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు, అప్పటి ఐటీ మంత్రి లోకేశ్ హస్తం ఉందని కమిటీ నిర్థారణకు వచ్చింది
భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సభాసంఘం రాజకీయ లబ్ది కోసం గత ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడినట్టు నిర్థారించింది. సేవామిత్రా యాప్ ద్వారా 30 లక్షల నుంచి 40 లక్షల మంది సమాచారం సేకరించినట్టు కమిటీ తేల్చింది.
హౌస్ కమిటీ మరికొందరు అధికారులను కూడా ప్రశ్నించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా తమ కమిటీ నివేదికను సభకు సమర్పిస్తుందని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి