తిరుపతి శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవున ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల కార్యక్రమాల్లో తెలియక కొన్ని పొరబాట్లు, దోషాలు..

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవున ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల కార్యక్రమాల్లో తెలియక కొన్ని పొరబాట్లు, దోషాలు దొర్లుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఉండేందుకు.. ఆగమ శాస్త్ర ప్రకారం.. ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో.. ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. తొలిరోజు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను.. విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడే స్నపనతిరుమంజనం ఎంతో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత.. శాత్తుమొర ఆస్థానం, ఆణివార ఆస్థానం నిర్వహించారు.



