AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌… కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్‌

ఏపీలో ఇవాళ పేరెంట్‌-టీచర్‌ మెగా మీటింగ్‌ టు పాయింట్‌ వో జరగబోతోంది. 2 కోట్ల 28 లక్షల మందికి పైగా భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పాల్గొననున్నారు. పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు...

Andhra Pradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌... కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్‌
Cm Chandrababu
K Sammaiah
|

Updated on: Jul 10, 2025 | 7:16 AM

Share

ఏపీలో ఇవాళ పేరెంట్‌-టీచర్‌ మెగా మీటింగ్‌ టు పాయింట్‌ వో జరగబోతోంది. 2 కోట్ల 28 లక్షల మందికి పైగా భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ పాల్గొననున్నారు. పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయనున్నారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌… తల్లిదండ్రుల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ల పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టుపై మాట్లాడుకోవడం… కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను గవర్నమెంట్ స్కూళ్లలో కూడా అప్లై చేయాలన్నది కూటమి సర్కార్ ఆలోచన. గత ఏడాది డిసెంబర్ ఏడున మెగా పేటీఎమ్‌ తొలి ప్రయత్నం విజయవంతమైంది. ఇవాళ సెకండ్ ఎటెంప్ట్.

విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు…ఒకే రోజున 2 కోట్ల మంది 28 లక్షల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఈ మెగా కార్యక్రమం గిన్నీస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కనుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కొత్తచెరువు గ్రామ జెడ్పీ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా పీటీఎం 2.ఓను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం 2.0ను ఒక ఉత్సవంలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారా లేదా.. ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించడమే మెగా పీటీఎం లక్ష్యం. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకునే అవకాశం లభిస్తుంది. ప్రతీ ఏడాది ఇదే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశం నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పం.

కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం మెగా పిటిఎం 2.ఓ కోసం పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో సత్యసాయి జూనియర్ కళాశాల సిద్ధమైంది. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం తొమ్మిదిన్నరకు సీఎం చంద్రబాబు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నలుగురు పిల్లల తల్లి మాధవి అనే మహిళతో సీఎం ముఖాముఖి మాట్లాడతారు. అక్కడినుంచి నడక మార్గంలో జడ్పీ బాయ్స్ హైస్కూల్ చేరుకుని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ పాల్గొంటారు. తర్వాత ప్రశాంత నిలయంలో సత్యసాయి మహాసమాధిని సందర్శిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు 1500 మంది పోలీస్ బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటైంది.