AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేణుకను పక్కా ప్లాన్‌తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం

పల్నాడు క్రోసూరు పోలీసు స్టేషన్ భవనంపై నుండి పడి వల్లపు రేణుక మృతి చెందడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలోనే ఈ ఘటన జరిగిందని, పోలీసులు దీనిని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని బంధువులు అంటున్నారు. దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

రేణుకను పక్కా ప్లాన్‌తోనే చంపేశారా..? క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో ఆ రోజు ఏం జరిగింది.. ఏపీలో సంచలనం
Woman Death
T Nagaraju
| Edited By: |

Updated on: May 07, 2026 | 6:06 PM

Share

ఆమె పేరు వల్లపు రేణుక.. రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. స్టేషన్ పై అంతస్తు నుండి కింద పడిపోయింది. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక చనిపోయింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డే ఆమె చంపేశాడన్న విమర్శలొస్తున్నాయి. వివరాల ప్రకారం.. రేణుకది చీరాల.. ఇరవై ఏళ్ల క్రితమే నర్సరావుపేటకు చెందిన సాంబయ్య ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. కొంతకాలం తర్వాత భర్తతో విబేధాల కారణంగా ఆమె ఒంటరిగా పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలోనే పొన్నూరుకు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డితో పరిచయం అయింది. వీరి మధ్య కూడా విబేధాలు రావడంతో కానిస్టేబుల్ 2021లో సస్పెండ్ అయ్యాడు. అనంతరం అతనికి గురజాల స్టేషన్ లో పోస్టింగ్ ఇచ్చారు. రేణుక మరొకసారి వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో శాఖాపరమైన విచారణను పెదకూరపాడు సిఐ సురేశ్ కు అప్పగించారు. రెండు రోజుల క్రితం సిఐ ఆమెను క్రోసూరు స్టేషన్ కు పిలిపించారు. విచారణ సయమంలో ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో టిఫిన్ చేయమని చెప్పి సిఐ పంపించారు. స్టేషన్ పై అంతస్థులో టిఫిన్ చేస్తుండగా ఆమెకు ఫిట్స్ వచ్చాయి. ఒక్కసారిగా పై అంతస్తు నుండి పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఆమె మృతికి వెంకటేశ్వరరెడ్డే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ సమయంలో కానిస్టేబుల్ కూడా స్టేషన్ లో ఉన్నాడని, అతనే ఆమెపై దాడి చేయడంతో కిందపడి చనిపోయిందని బంధువులు అంటున్నారు. అయితే బంధువులు ముందుకొచ్చి ఫిర్యాదు చేయలేదు.

రేణుకను ఎయిమ్స్ కు తరలించడంపై కూడా అనుమానాలున్నాయి. క్రోసూరు నుండి గుంటూరు జిజిహెచ్ కు తరలించకుండా ఎయిమ్స్ ఎందుకు తరలించారంటూ బంధువులు పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు రేణుక బంధువులతో మాట్లాడి మీడియాలో ఆమె మృతిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తిచేశారు. దీంతో బంధువులు మిన్నుకుండిపోయారు. రేణుక మరణంపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.

Follow Us