AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభయారణ్యంలో అపురూప కట్టడం! బయటపడ్డ శంకువు ఆకారపు బావి.. అసలు రహస్యం ఇదే!

ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుత కట్టడాలు అప్పటి పాలకుల దూరదృష్టికి, కళా హృదయానికి నిదర్శనాలు. అటువంటిదే కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలోని లంకమల అభయారణ్యంలో వెలుగుచూసిన పురాతన బావి. మద్దూరు బీట్ పరిధిలోని వరికుంట-చండువాయి మార్గంలో ఉన్న ఈ బావి, తన విశిష్టమైన శంకువు ఆకారంతో చూపరులను ఆకట్టుకుంటోంది.

అభయారణ్యంలో అపురూప కట్టడం! బయటపడ్డ శంకువు ఆకారపు బావి.. అసలు రహస్యం ఇదే!
Rare Architectural Marvel Conical Well
Sudhir Chappidi
| Edited By: |

Updated on: May 07, 2026 | 6:18 PM

Share

ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుత కట్టడాలు అప్పటి పాలకుల దూరదృష్టికి, కళా హృదయానికి నిదర్శనాలు. అటువంటిదే కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలోని లంకమల అభయారణ్యంలో వెలుగుచూసిన పురాతన బావి. మద్దూరు బీట్ పరిధిలోని వరికుంట-చండువాయి మార్గంలో ఉన్న ఈ బావి, తన విశిష్టమైన శంకువు ఆకారంతో చూపరులను ఆకట్టుకుంటోంది.

ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రేనాటి చోళులు, బాణులు, వైడుంబులు, విజయనగర రాజులు ఈ బావిని ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో వివిధ ప్రాంతాల నుండి తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు లంకమల అడవి ప్రధాన మార్గంగా ఉండేది. దట్టమైన అడవిలో ప్రయాణించే బాటసారులు, భక్తుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ఈ బావిని నిర్మించారు.

ఈ బావి ఆకారం కేవలం అందం కోసమే కాదు, ఒక ప్రత్యేక ఉద్దేశంతో నిర్మించబడింది. శంకువు పైభాగం నుండి నీరు కిందకు పడేలా, దాహం వేసిన వారు సులభంగా నీటిని అందుకునేలా దీనిని రూపొందించారు. రాతితో అత్యంత కళాత్మకంగా నిర్మించిన ఈ కట్టడం శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరకుండా ఉంది.

అటవీ శాఖ అధికారులు ఇటీవల ఈ పురాతన బావిని గుర్తించి, దాని విశిష్టతను బయటి ప్రపంచానికి చాటారు. అటవీ మార్గంలో ప్రయాణించే వారికి ఇది ఒక సేదతీరే కేంద్రంగానే కాకుండా, మన పూర్వీకుల నీటి యాజమాన్య పద్ధతులకు మరియు నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇటువంటి చారిత్రక సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us