AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best AI Courses: మీ తలరాతను మార్చే బెస్ట్ AI టూల్స్‌ ఇవే.. వీటిని నేర్చుకుంటే భవిష్యత్తు మీదే!

వేగంగా పరుగులు తీసే కాలంలో పరిగెత్తకుంటే కొన్ని యుగాలు వెనకే పడిపోతాం. ప్రస్తుతం ఏఐ హవా నడుస్తుంది. ఎన్ని కోర్సులు చదివినా ఏఐ టూల్స్ పై కనీస అవగాహన లేకుంటే ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టం. యువత ఈ కింది AI టూల్స్ నేర్చుకుంటే లక్షల్లో జీతంతోపాటు కెరీర్ భరోసా కూడా దక్కుతుంది. అలాంటి బెస్ట్ ఏఐ కోర్సుల పూర్తి వివరాలు ఈ కింద అందిస్తున్నాం..

Best AI Courses: మీ తలరాతను మార్చే బెస్ట్ AI టూల్స్‌ ఇవే.. వీటిని నేర్చుకుంటే భవిష్యత్తు మీదే!
Best AI Courses Online
Srilakshmi C
|

Updated on: May 07, 2026 | 5:23 PM

Share

నేటి డిజిటల్ యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రతి రంగంలోనూ AI హవా నడుస్తోంది. మెషిన్ లెర్నింగ్, చాట్‌జీపీటీ వంటి కోర్సులు ప్రస్తుతం సర్వత్రా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో AI-ఆధారిత కోర్సుల గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..

మెషిన్ లెర్నింగ్ కోర్సు

మెషిన్ లెర్నింగ్ అనే కోర్సులో కంప్యూటర్లకు డేటా ఆధారంగా నేర్చుకునే, ఆలోచించే సామర్థ్యాన్ని నేర్పిస్తారు. ఇందులో అల్గోరిథంలు (రిగ్రెషన్, వర్గీకరణ), పైథాన్, టెన్సర్‌ఫ్లో, సైకిట్-లెర్న్, డేటా ట్రైనింగ్‌ అండ్ మోడల్, ఏఐ మోడల్స్‌ నిర్ణయాలు తీసుకునే విధానం వంటి స్పెషలైజేషన్లు ఉంటాయి. ఈ కోర్సు నేర్చుకున్న ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.5 నుంచి 10 లక్షల వరకు జీతం అందుతుంది. అనుభవం ఉన్న వారు ఏడాదికి రూ. 12 నుంచి 25 లక్షలకు పైగా జీతం అందుకోవచ్చు. ML ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, డేటా అనలిస్ట్, ఐటీ, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ రంగాలలో ఈ కోర్సు నేర్చుకున్న వారికి భారీ డిమాండ్ ఉంది.

డేటా సైన్స్‌ కోర్సు

డేటా సైన్స్ కోర్సులు డేటా విశ్లేషణ, విజువలైజేషన్, ప్రిడిక్షన్‌లను నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. ఇవి ప్రముఖ ఐటీ కంపెనీలకు అవసరమైన కీలకమైన నైపుణ్యాలు. ఈ కోర్సులో డేటా విశ్లేషణ (ఎక్సెల్, పైథాన్, SQL), డేటా విజువలైజేషన్ (పవర్ BI, టాబ్లో), ప్రిడిక్టివ్ అనలిటిక్స్, బిగ్ డేటా నిర్వహణ వంటి స్పెషలైజేషన్లు అందిస్తారు. డేటా సైన్స్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఫ్రెషర్స్‌కు ఏడాదికి రూ. 6 నుంచి 12 లక్షల వరకు జీతంగా లభిస్తుంది. అనుభవం ఉన్నవారికి ఏడాదికి రూ.15 నుంచి 30 లక్షలకు పైగా జీతం లభించే అవకాశం ఉంది. డేటా సైంటిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజనీర్ వంటి ఉద్యోగాల్లో వీరు యమ డిమాండ్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

AI టూల్స్, ChatGPTలో నిపుణులు

ఈ రోజుల్లో ఏఐ టూల్స్, చాట్‌జీపీటీ కోర్సులు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, డిజిటల్ పనిని సులభతరం చేయడంపై శిక్షణను అందిస్తాయి. చాట్‌జిపిటి, మిడ్‌జర్నీ, ఏఐ రైటింగ్ టూల్స్ కంటెంట్ క్రియేషన్ ఆటోమేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సోషల్ మీడియా, డిజిటల్ వర్క్ ఆటోమేషన్ వంటివి ఇందులో నేర్చుకోవచ్చు. ఈ నైపుణ్యాలు ఉన్న ఫ్రెషర్స్ ఏడాదికి రూ. 3 నుంచి 8 లక్షలు, ఫ్రీలాన్సర్లకు నెలకు రూ. 20,000 నుంచి 1 లక్ష వరకు జీతం అందుకోవచ్చు. ఈ నైపుణ్యాలు ఉన్నవారికి మార్కెట్లో కంటెంట్ క్రియేటర్‌, AI స్పెషలిస్ట్, డిజిటల్ మార్కెటర్ వంటి జాబ్‌ ఆఫర్‌లు అందుతాయి.

ఆటోమేషన్‌ కోర్సు

ఆటోమేషన్ కోర్సుల ద్వారా అనేక పనులను స్వయంచాలకం చేయడం నేర్చుకోవచ్చు. దీనివల్ల కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. ఇందులో RPA (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్), UiPath, ఆటోమేషన్ ఎనీవేర్‌ వంటి టూల్స్, రిపిటీటివ్‌ పనులను స్వయంచాలకం చేయడం, వర్క్‌ఫ్లో ఆప్టిమైజేషన్ వంటి స్కిల్స్‌ నేర్చుకోవచ్చు. ఈ స్కిల్స్‌ నేర్చుకుంటే ఫ్రెషర్స్‌కు ఏడాదికి రూ. 4 నుంచి 9 లక్షల వరకు జీతం అందుతుంది. అనుభవం ఉన్న వారికి ఏడాదికి రూ. 10 నుంచి 20 లక్షల వరకు జీతం అందుతుంది. ఆటోమేషన్ ఇంజనీర్, ఆర్‌పీఏ డెవలపర్ వంటి జాబ్‌ ఆఫర్స్‌ అందుకోవచ్చు.

ఈ కోర్సులు ఎక్కడ నేర్చుకోవాలి?

ఈ కోర్సుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి కోర్సెరా, ఉడెమీ, గూగుల్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సులభంగా అందుబాటులో ఉంటాయి. చాలా కోర్సులు ఉచితంగా కూడా లభిస్తాయి. దీనివల్ల విద్యార్థులు పెద్దగా ఖర్చు లేకుండా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ఏఐ నైపుణ్యాలు ఉద్యోగాలు పొందడంలో సహాయపడటమే కాకుండా ఫ్రీలాన్సింగ్ చేయడానికి, స్వంతంగా స్టార్టప్‌ను ప్రారంభించడానికి కూడా అవకాశాలను అందిస్తున్నాయి.

ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

  • అధిక డిమాండ్ ఉన్న నైపుణ్యాలు
  • మంచి జీతం అవకాశాలు
  • ఇంటి నుంచే పని చేసే అవకాశం
  • ఫ్రీలాన్సింగ్, ప్రపంచవ్యాప్త అవకాశాలు
  • వేగవంతమైన కెరీర్ వృద్ధి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us